Begin typing your search above and press return to search.

అక్కినేని హీరో వాయిదాల పర్వం..?

By:  Tupaki Desk   |   11 May 2022 2:30 AM GMT
అక్కినేని హీరో వాయిదాల పర్వం..?
X
అక్కినేని ఫ్యామిలీ మూడోతరం హీరో, యూత్ కింగ్ అఖిల్ గతేడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంతో ఎట్టకేలకు సక్సెస్ రుచి చూశారు. అదే జోరును కొనసాగించేందుకు ఇప్పుడు అఖిల్ ''ఏజెంట్‌'' అనే హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ లో నటిస్తున్నారు.

'ఏజెంట్' చిత్రాన్ని స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని.. 2022 ఇండిపెండెన్స్ డే వీక్ లో ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

అఖిల్ కెరీర్ లో 5వ సినిమాగా రాబోతున్న 'ఏజెంట్' కు సంబంధించిన షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. మేకర్స్ గడువులోగా చిత్రీకరణను పూర్తి చేయలేకపోతే.. సినిమా మరింత ఆలస్యం అవుతుంది. దీనికి తోడు అదే రోజున పలు క్రేజీ చిత్రాలు విడుదల ప్లాన్ చేసుకున్నాయి.

నితిన్ హీరోగా ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు. అలానే సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ 'యశోద' కూడా అదే రోజున థియేటర్లలోకి రాబోతోంది.

ఇక అఖిల్ సోదరుడు అక్కినేని నాగచైతన్య నటించిన తొలి హిందీ సినిమా 'లాల్ సింగ్ చద్దా' ఆగస్టు 11న రిలీజ్ కానుంది. అమీర్ ఖాన్ - కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని తెలుగుతో పాటుగా మరికొన్ని భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ సినిమాని పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

నిజానికి 'ఏజెంట్' చిత్రాన్ని 2021 డిసెంబర్ 24న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ఫస్ట్ లుక్ అప్పుడే అనౌన్స్ చేశారు. అయితే కరోనా పాండమిక్ నేపథ్యంలో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆగస్టు 12న రిలీజ్ ప్లాన్ చేయగా.. పోటీగా మరో మూడు చిత్రాలు వస్తున్నాయి.

'ఏజెంట్' సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు అక్కినేని వారసుడి కెరీర్ లో అధిక బడ్జెట్ తో రూపొందిస్తున్న మూవీ. అలాంటప్పుడు బాక్సాఫీస్ వద్ద పోటీపడి విడుదల చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. అందుకే మేకర్స్ వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారని.. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన చేస్తారని అంటున్నారు.

'ఏజెంట్' సినిమా ఎప్పుడొచ్చినా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అక్కినేని అభిమానులు ధీమాగా ఉన్నారు. స్పై థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ ఓ గూఢచారిగా కనిపించనున్నారు. ఇప్పటి వరకు లవర్‌ బాయ్‌ తరహా పాత్రల్లో కనిపించిన యూత్ కింగ్.. తొలిసారిగా యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనువిందు చేయనున్నారు.

దీని కోసం అఖిల్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. డిఫరెంట్ హెయిర్ స్టైల్ - సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఆకట్టుకున్నాడు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సరెండర్2సినిమా బ్యానర్స్ పై సుంకర రామబ్రహ్మం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ - స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి హిప్ హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.