Begin typing your search above and press return to search.

ఏజెంట్ ను కన్ఫ్యూజ్ చేయడమెందుకు?

By:  Tupaki Desk   |   9 Oct 2022 3:30 PM GMT
ఏజెంట్ ను కన్ఫ్యూజ్ చేయడమెందుకు?
X
ఏడాది అక్కినేనీ హీరోలకు అంతగా కలిసి రాలేదు అని చెప్పాలి. బంగార్రాజు సినిమాతో నాగార్జున నాగచైతన్య డీసెంట్ సక్సెస్ అందుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం ఆ సినిమా మార్కెట్ ను పెంచేంత రేంజ్ లో అయితే సక్సెస్ కాలేదు. ఇక ఆ తర్వాత నాగచైతన్య అతి దారుణమైన డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నాగార్జున రీసెంట్ గా ది ఘోస్ట్ సినిమాతో మరో దారుణమైన ఫలితాన్ని ఎదుర్కొన్నాడు.

ఇక ఈ రెండు సినిమాల తర్వాత నాగార్జున అభిమానులు ఎక్కువగా ఏజెంట్ సినిమా పైనే నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ ఇంకా విడుదల విషయంలో కన్ఫ్యూజన్ అయితే క్లారిటీ రావడం లేదు. ఒక విధంగా నాగర్జున ఈ సినిమా విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనవసరంగా సినిమాను పాడు చేస్తున్నాయని టాక్ కూడా వస్తోంది.

సినిమా మొదలు పెట్టినప్పుడు నుంచి కూడా నాగార్జున ప్రతి విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డికి సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు పూర్తి అయిన తర్వాత ప్రత్యేకంగా ఆయన సన్నివేశాలను చూస్తున్నారట. అయితే రీసెంట్ గా కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. అందులో దాదాపు 30% సన్నివేశాలు నిర్మాతలు రీ షూట్ చేయడానికి రెడీ అయ్యారట.

ఒక విధంగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఫ్రీడమ్ ఇస్తే అతను అనుకున్నట్లు చాలా మంచి సినిమాను తెరపైకి తీసుకురాగలడు. కానీ నాగార్జున అనవసరంగా తన సలహాలతో సినిమాను పాడు చేస్తున్నారా అనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇక రీసెంట్ గా ది ఘోస్ట్ సినిమాతో ఆయన ప్రణాళికలు అన్నీ కూడా వృధా కావడంతో ఇప్పుడు ఏజెంట్ సినిమాలో కూడా అలాంటి తప్పులు జరగకూడదని మరింత ఎక్కువ సలహాలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి అలాగే చిత్ర యూనిట్ సభ్యులు చెప్పినట్లే చేస్తారా లేదంటే వారికి నచ్చినట్లుగా సినిమాను తెరపైకి తీసుకు వస్తారా అనేది చూడాలి.