Begin typing your search above and press return to search.

అయ్యగారి నిర్ణయం సరైనదేనా..?

By:  Tupaki Desk   |   25 Oct 2022 9:30 AM GMT
అయ్యగారి నిర్ణయం సరైనదేనా..?
X
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని మరియు స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఏజెంట్''. అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఉన్నట్టుండి ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

వచ్చే సంక్రాంతి కి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్ చూడబోతున్నామని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. 'ఆదిపురుష్' 'వాల్తేర్ వీరయ్య' మరియు 'వీర సింహారెడ్డి' వంటి భారీ చిత్రాలు రేసులో ఉన్నాయి. వీటితోపాటు 'వారసుడు' అనే క్రేజీ డబ్బింగ్ సినిమా కూడా ఉంది. అకస్మాత్తుగా ఇప్పుడు ''ఏజెంట్'' కూడా బరిలో దిగుతున్నట్లు అనౌన్స్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మెగాస్టార్ చిరంజీవి - నటసింహం బాలయ్య వంటి పెద్ద హీరోలు పోటీ పడుతున్నారు. దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత అదే సీజన్ లో తమిళ్ హీరోని తెలుగులో లాంచ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యలో యంగ్ హీరో అఖిల్ ని రేసులోకి దించడం సరైన నిర్ణయమేనా? అని ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.

నిజానికి 'ఏజెంట్' చిత్రాన్ని లాంచ్ చేసిన రోజే 2021 డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా పాండమిక్ నేపథ్యంలో అన్నీ అనుకున్నట్లు జరగలేదు. ఆ తర్వాత 2022 ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరింత సమయం అవసరం అవడంతో సినిమాని నిరవధికంగా వాయిదా వేశారు.

మంచి డేట్స్ ను పెద్ద సినిమాలన్నీ లాక్ చేసుకోవడంతో 'ఏజెంట్' చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అంతకంటే ముందే సంక్రాంతికి రావాలని నిర్ణయించుకున్నారు. పెద్ద హీరోలతో పోటీకి సై అనేంత సామర్థ్యం అఖిల్ సినిమాకు ఉందా? నిర్మాతలు ఇలాంటి డెసీజన్ ఎందుకు తీసుకున్నారు? అనే ప్రశ్నలు అందరిలో ఉన్నాయి.

సంక్రాంతి సీజన్ లో ఎప్పుడూ రెండు మూడు క్రేజీ చిత్రాలే రిలీజ్ అవుతుంటాయి. అయితే పెద్ద సినిమాల మధ్య అప్పుడప్పుడు కొన్ని చిన్న మీడియం రేంజ్ చిత్రాలు కూడా వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు 'ఏజెంట్' సినిమాని విడుదల చేయడానికి ఇదే ఉత్తమ సమయమని మేకర్స్ భావించి ఉండొచ్చు.

సీనియర్ హీరోల మధ్య యూత్ ఫుల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా కంటెంట్ క్లిక్ అయితేనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యాక్షన్ ప్రియులు ఫెస్టివల్ సీజన్ లో 'ఏజెంట్' కు ఓటేసే అవకాశం ఉంటుంది. కాకపోతే టాక్ ఎంత బాగున్నా కచ్చితంగా ఓపెనింగ్స్ మీద దెబ్బ పడతుంది.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్.. ఈసారి భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ & టీజర్ కు ట్రేడ్ మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

అఖిల్ సినిమాని చిరంజీవి - బాలయ్య - ప్రభాస్ వంటి బిగ్ స్టార్స్ కు పోటీగా నిలపడంతో.. ఆల్రెడీ 'ఏజెంట్' హెడ్ లైన్స్ లో నిలిచింది. ఇది పరోక్షంగా సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వడమే కాదు.. హైప్ రెట్టింపు అయ్యేలా చేస్తుంది. అందుకే సీనియర్ హీరోలకు అక్కినేని కుర్ర హీరో గట్టి పోటీ ఇవ్వవచ్చని భావించవచ్చు.

కానీ అదే సమయంలో 'ఏజెంట్' కు పెద్ద హీరోల వల్ల పెద్ద దెబ్బ పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్. నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాకు మంచి థియేటర్లు పొందవచ్చు. అయితే బరిలో పెద్ద హీరోలు ఉన్నారు కాబట్టి.. భారీ ఓపెనింగ్స్ ను అఖిల్ కోల్పోతాడు.

'ఏజెంట్' కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పటికీ.. సోలో రిలీజ్ డేట్ కి వచ్చినంత ఓపెనింగ్స్ రాకపోవచ్చు. అందుకే సంక్రాంతి సీజన్ కు వారం ముందో వారం తర్వాతో.. లేదా ఎలాంటి పోటీ లేకుండా సోలోగా అఖిల్ సినిమాని రిలీజ్ చేయడం మంచిదని కొందరు అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఏజెంట్ నిర్మాతలు ఎలా ఆలోచిస్తారో.. అఖిల్ అండ్ టీమ్ నిర్ణయం సరైందో కాదో అనేది కాలమే సమాధానం చెబుతుంది.