Begin typing your search above and press return to search.
మంచు కొండల్లో ఏజెంట్ సినిమా చూపించాడు!
By: Tupaki Desk | 16 Jun 2022 3:39 PM GMTఅక్కినేని చియాన్ అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం `ఏజెంట్`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఒక హాలీవుడ్ స్టార్ ని తలపించేలా అతడు మజిల్స్ ని షేపప్ చేసిన తీరు ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఏజెంట్ లుక్ యూత్ లోకి దూసుకెళ్లింది. మ్యాకో మ్యాన్ లా బీస్ట్ లా అఖిల్ రూపం గుబులు పుట్టించింది.
ఇక ఏజెంట్ కోసం సురేందర్ రెడ్డి ఎంపిక చేసుకున్న స్పై కథాంశం లొకేషన్లు కాస్ట్యూమ్స్ వగైరా వగైరా ఎంతో క్యూరియాసిటీని పెంచాయి. ఒక రకంగా అఖిల్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసేందుకు సురేందర్ రెడ్డి తపిస్తున్నారని తాజా లీక్ లు చెబుతున్నాయి. రహస్య ఏజెంట్ గా అఖిల ని భిన్నమైన రూపాల్లో రకరకాల కోణాల్లో ఆవిష్కరించనున్నారన్న టాక్ ఆసక్తిని పెంచుతోంది. ఇక ఏజెంట్ సాహసవిన్యాసాలు కొండలు కోనలు గుట్టలు జలపాతాలు అంటూ ఒక రేంజులో కొనసాగనున్నాయి. ముఖ్యంగా మంచు కొండల్లో ఏజెంట్ విన్యాసాలకు సంబంధించిన ఎపిసోడ్స్ మూవీకే హైలైట్ గా నిలవనున్నాయని ఇంతకుముందు విడుదలైన ఫోటోలు వీడియోలు వెల్లడించాయి.
తాజాగా అఖిల్ మంచు కొండల్లో షూట్ కి సంబంధించిన కొల్లేజ్ ఫోటోల వీడియోని రిలీజ్ చేసారు. ఈ కొల్లేజ్ లో ఫోటోలు ఇంతకుముందే రివీలైనా తాజా వీడియో ఎంతో ఎగ్జయిట్ మెంట్ ని పెంచుతోంది. ఈ వీడియోకి ఏజెంట్ లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. చియాన్ అఖిల్ అభిమానుల్లో ఈ వీడియో వైరల్ గా మారుతోంది. అఖిల్ ని బార్న్ రేంజులో ఆవిష్కరిస్తున్న సురేందర్ రెడ్డి ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుంది? అన్నది వేచి చూడాలి. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ లో ఏజెంట్ తన రేంజును నిలబెట్టుకుంటాడా లేదా? అన్నది క్యూరియాసిటీని పెంచే ఎలిమెంట్. అఖిల్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ అవసరం. అందుకే ఇంతగా శ్రమిస్తున్నాడు. స్టార్ హీరోగా సత్తా చాటేందుకు మాస్ ఇమేజ్ చాలా అవసరం. ఆ కోణంలో అతడు శ్రమిస్తున్న వైనం కనిపిస్తోంది. ఆగస్టు 12న ఏజెంట్ మూవీ విడుదల కానుంది.