Begin typing your search above and press return to search.

అఖిల్ అంత ఫాస్ట్ గా రాగలడా!

By:  Tupaki Desk   |   24 Jan 2019 4:27 PM IST
అఖిల్ అంత ఫాస్ట్ గా రాగలడా!
X
మిస్టర్ మజ్నుతో మూడో ప్రయత్నంలో గట్టి హిట్ కొడతానంటున్న అఖిల్ ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే మూడేళ్ళల కేవలం మూడే సినిమాలు చేయడం గురించి అభిమానుల్లో కొంత అసంతృప్తి ఉంది. ఫ్లాప్ కావడం ఏ హీరోకైనా సహజంగా జరిగేదే. అంత మాత్రాన నెలల తరబడి కథ పేరుతో జాప్యం చేయడం తగదు. ఫ్యాన్స్ కోసమైనా రెగ్యులర్ గా సినిమాలు చేయడం చాలా అవసరం. అయితే ఇది ఇన్నాళ్ళు గుర్తించని అఖిల్ ఈసారి మాత్రం స్పీడ్ పెంచుతాను అంటున్నాడు,

మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా ఈ ప్రశ్న ఎదురైనప్పుడు వచ్చే దసరాకు ఇంకో సినిమాతో పలకరిస్తాను అని చెప్పేసాడు. అంటే ఒకే ఏడాదిలో రెండు సినిమాలు. ఇది ఫ్యాన్స్ కి నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ గ్యాప్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య మజిలి మాత్రమే వచ్చుంటుంది. నాగార్జున ఇంకా కొత్త సినిమా మొదలు పెట్టనే లేదు కాబట్టి దసరాకు రావడం అంత ఈజీ కాదు. అఖిల్ వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుపెట్టుకున్నా ఈజీగా దసరాను టార్గెట్ చేయొచ్చు. అయితే దర్శకుడు ఎవరు బ్యానర్ ఏది అనే వివరాలు మాత్రం బయటపెట్టడం లేదు అఖిల్.

రెండు మూడు కథలు విన్నానని మిస్టర్ మజ్ను హడావిడి అయ్యాక ఒకటి అందులో ఫైనల్ చేస్తానని చెప్పాడు. అంటే ముగ్గురు దర్శకులు వెయిట్ చేస్తున్నారా లేక ఒకే దర్శకుడు మూడు కథలను రెడీ చేసి పెట్టాడా అనే ప్రశ్నకు సమాధానం సస్పెన్స్. మిస్టర్ మజ్ను నిర్మాణంలో ఉండగానే ఆది పినిశెట్టి అన్నయ్య సత్య చెప్పిన లైన్ ఒకటి అఖిల్ కు నచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి దాంతోనే కంటిన్యూ అవుతాడేమో చూడాలి. ఇంకొద్ది గంటల్లోనే మిస్టర్ మజ్ను తెరపై సందడి చేయబోతున్నాడు