Begin typing your search above and press return to search.
పాటతో అఖిల్ అదరగొట్టాడుగా..
By: Tupaki Desk | 1 July 2017 8:54 AM GMTనాగార్జున కొడుకు అఖిల్ కు సినిమాల్లోకి రాకముందు నుంచే అతడికి అభిమానులున్నారు. సిసింద్రీగా పసి వయసులోనే అందరినీ ఆకట్టుకున్న అతడిని ఇండస్ట్రీ మొదటి నుంచి కాబోయే హీరోగానే చూసింది. చూడటానికి బావుంటాడు కాబట్టి హీరోగా కచ్చితంగా షైన్ అవతాడని అంతా అనుకున్నారు. అక్కినేని అభిమానులంతా ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ డెబ్యూ ఫిలిం అఖిల్ సినిమా వారిని ఎంతో నిరాశపరిచింది.
లాంచింగ్ సినిమా నిరాశపరిచినా అఖిల్ టాలెంట్ ను తక్కువ అంచనా వేయడానికేం లేదు. సినీ తారల క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడలా అఖిల్ స్టార్ అట్రాక్షన్ గా నిలిచాడు. అతడిలో ఇంకో టాలెంట్ కూడా ఉందన్న విషయం రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. సైమా 2017 అవార్డ్స్ ఫంక్షన్ వేదికపై తన పాటతో అందరినీ కట్టిపడేశాడు. సాధారణంగా ఇలాంటి వేదికలపై హీరోలంతా డ్యాన్స్ పర్ఫార్మెన్సులతో అదరగొట్టేస్తారు. స్టేజ్ పై సింగర్ గా మెప్పించడం అంత ఈజీకాదు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తన రాబోయే సినిమాలో ‘ఏవేవో కలలు కన్నా’ పాటను అఖిల్ పాడాడు. ఈ పాట విన్నవారంతా అఖిల్ ను మెచ్చుకోవడమే కాదు ప్లేబాక్ సింగర్ గా కూడా చక్కగా రాణిస్తాడని చెప్పారు.
విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ చేస్తున్న అఖిల్ రెండో సినిమాకు నాగార్జునే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. సింగర్ గా మంచి మార్కులే పడ్డాయి కాబట్టి రాబోయే సినిమాల్లో సొంతంగా పాట పాడటానికి అఖిల్ ట్రై చేయొచ్చు. నాగార్జున, విక్రమ్ కె.కుమార్ మనసు పెడితే ఈ సినిమాతోనే గొంతు సవరించుకోవచ్చు. చూద్దాం..
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/