Begin typing your search above and press return to search.
అఖిల్ రెండో సినిమా ఆ రీమేక్?
By: Tupaki Desk | 24 Feb 2016 6:33 AM GMTఅక్కినేని నవతరం వారసుడు అఖిల్ లాంఛింగ్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా... ఈ అక్కినేని హీరో మొదటి మూవీ అఖిల్ చివరకు నిరాశపరిచింది. లాంఛింగ్ హీరోల్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ కొట్టాడని అనిపించుకున్నాడు. దీంతో అఖిల్ రెండో వెంచర్ పై చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలని నాగార్జున డిసైడ్ అయిన విషయం తెలిసిందే. అప్పుడే కంగారేం లేదని నాగ్ పైకి చెబ్తున్నా.. చాలా స్టోరీస్ వింటున్నారు అక్కనేని హీరోలు. ఇప్పుడు వీళ్ల సెర్చింగ్ తుది దశకు వచ్చిందని తెలుస్తోంది. అఖిల్ రెండో సినిమాగా రీమేక్ ని ఫిక్స్ చేశారని అంటున్నారు.
అయితే మనోళ్లు సాధారణంగా సౌత్ సినిమాలను రీమేక్ ల కోసం సెలెక్ట్ చేసుకుంటారు కానీ.. అఖిల్ కోసం బాలీవుడ్ సినిమాని ఎంపిక చేశారు. రణ్ బీర్ కపూర్-దీపికా పదుకొనే జంటగా నటించిన మూవీ 'యే జవానీ హై దివానీ'మూవీని అఖిల్ తో తీసేందుకు ఫిక్స్ అయ్యారట నాగార్జున. ఇప్పటికే ఈ మూవీ రీమేక్ కి అవసరమైన పనులు కూడా మొదలైపోయాయని తెలుస్తోంది. అయితే.. యే జవానీ హై దివానా ని నిర్మించిన ధర్మ ప్రొడక్షన్స్ కి.. తమ సినిమాల రీమేక్ రైట్స్ విక్రయించే అలవాటు లేదు. అందుకే ఈ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునేందుకు నాగ్ ఒప్పించారట.
అంటే ధర్మ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి ఈ రీమేక్ ని నిర్మిస్తాయి. హీరోయిన్, డైరెక్టర్లను ఇంకా ఎంపిక చేయలేదు. రైట్స్ సంగతి ఓ కొలిక్కి రాగానే.. మిగిలిన డీటైల్స్ వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.