Begin typing your search above and press return to search.
కింగ్ కి అల్ట్రా కూల్ ఏజెంట్ శుభాకాంక్షలు
By: Tupaki Desk | 29 Aug 2021 10:30 AM GMTనేడు కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకుముందు నాగచైతన్య- సమంత- అమల సహా పలువురు కుటుంబీకులు స్నేహితుల నుంచి నాగార్జున విషెష్ అందుకున్నారు.
ఇప్పుడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ నుండి విషెస్ దక్కాయి. అఖిల్ తన ఇన్ స్టాగ్రామ్ లో తన తండ్రి నాగార్జున .. సోదరుడు నాగ చైతన్యతో కలిసి ఉన్న లేటెస్ట్ ఫోటోని షేర్ చేయగా అది అక్కినేని అభిమానుల్లో వైరల్ గా మారింది.
లైఫ్ కి మీ అప్రయత్నమైన విధానం నిజంగా స్ఫూర్తిదాయకం. మైడియర్ డాడ్.. మీతో ప్రతి క్షణం అమూల్యమైనది.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఎల్లప్పుడూ ప్రేమించండి`` అని అఖిల్ పోస్ట్ చేశాడు. అక్కినేని త్రయం ఎంతో క్యాజువల్ గా కనిపిస్తున్నా సింపుల్ గా ఆకట్టుకున్నారు. అఖిల్ ఈ ఫోటోలో ఏజెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. పొడవాటి గిరజాల జుత్తు గుబురుగడ్డం మీసకట్టుతో మ్యాన్లీనెస్ కనిపిస్తోంది.
`ఏజెంట్` రాక ఎప్పుడు?
అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అక్టోబర్ లో విడుదల కానుండగా మరోవైపు ఏజెంట్ చిత్రీకరణతో అతడు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అఖిల్ అక్కినేని- సురేందర్ రెడ్డి- అనిల్ సుంకర క్రేజీ ప్రాజెక్ట్ ఏజెంట్ ఇటీవల ట్రెండింగ్ గా మారుతోంది. ఇప్పటికే ఏజెంట్ ఫస్ట్ లుక్ సహా రకరకాల ఫోటోగ్రాఫ్ లను రిలీజ్ చేయగా వైరల్ అయ్యాయి. ఈ మూవీ కోసం అఖిల్ మేకోవర్ ఆకట్టుకుంటోంది. అఖిల్ బీస్ట్ ని తలపిస్తున్నాడు. అతడు జిమ్ లో కఠోర శిక్షణ తీసుకుని భారీ కాయుడిగా మారాడు.
ఏజెంట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ .. అఖిల్ కెరీర్ బెస్ట్ గా ఉంటుందని సూరి బృందం చెబుతోంది. ఈ చిత్రంలో అఖిల్ ని పూర్తిగా కొత్త వెర్షన్ లో చూపించాలన్నదే దర్శకుడు సూరి తాపత్రయం. ఇక స్పై థ్రిల్లర్లు అనగానే హాలీవుడ్ లో వచ్చిన బార్న్ సిరీస్ .. జేమ్స్ బాండ్ సిరీస్.. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ గుర్తుకు వస్తాయి. ఈ ఫ్రాంఛైజీల్లో ఉండే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇప్పుడు ఏజెంట్ కి ప్రధాన అస్సెట్ కానుందని తెలుస్తోంది. ఇందులో అఖిల్ భారీ యాక్షన్ విన్యాసాలు గగుర్పాటుకు గురి చేస్తాయి. ఈ సినిమాతో అతడు మాస్ ఆడియెన్ లోకూ దూసుకెళతాడని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇన్నాళ్లు దోబూచులాడిన విజయాన్ని అతడు అందుకుంటాడని అభిమానులు హోప్ తో ఉన్నారు.
ఏజెంట్ రెగ్యులర్ షూటింగ్ కి ముందే అఖిల్ జిమ్ లో శ్రమించి కండలు పెంచాడు. స్పై థ్రిల్లర్ లో అఖిల్ సరసన కొత్తమ్మాయి సాక్షి వైద్య నటిస్తోంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. రాగూల్ హెరియన్ ధారుమాన్ సినిమాటోగ్రఫీ అందిస్తారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలీ ఎడిటర్ కాగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. అజయ్ సుంకర- పాతి దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు. ఎకె ఎంటర్ టైన్మెంట్స్ - సురేందర్ 2 సినిమా బ్యానర్లలో రామబ్రహ్మం సుంకర- అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందించారు. దర్శక-రచయిత ద్వయం గతంలో కిక్- రేస్ గుర్రం వంటి కొన్ని బ్లాక్ బస్టర్ ల కోసం కలిసి పనిచేశారు. ఈ కలయికలో మరో సూపర్ హిట్ ని అభిమానులు ఆశిస్తున్నారు. ఏజెంట్ వచ్చే ఏడాది థియేటర్లలోకి విడుదలయ్యేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.