Begin typing your search above and press return to search.

నాగచైతన్య.. అఖిల్.. మరీ ఇంత తేడానా?

By:  Tupaki Desk   |   21 Oct 2015 1:30 PM GMT
నాగచైతన్య.. అఖిల్.. మరీ ఇంత తేడానా?
X
లక్షన్నర ఎక్కడ.. తొమ్మిదిన్నర లక్షలు.. ఎక్కడ? రెంటి మధ్య తేడా ఆరు రెట్ల కంటే ఎక్కువ. ఇంతకీ ఈ లెక్కలు ఏంటనుకుంటున్నారా? ఫేస్ బుక్‌ లో నాగచైతన్య, అఖిల్ అఫీషియల్ పేజీలకు వచ్చిన లైకుల సంఖ్య ఇది. పది సినిమాలకు దగ్గరవుతున్న చైతూ పేజీకి కేవలం 1.66 లక్షల లైకుంటుంటే.. ఇంకా హీరోగా అరంగేట్రమే చేయని అఖిల్ అప్పుడే 9.56 లక్షల లైకులతో మిలియన్ మార్కు దిశగా దూసుకెళ్తున్నాడు. ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు హీరోల విషయంలో అభిమానులు మరీ ఇంత డిఫరెంటుగా ఎందుకు ఉంటున్నారన్నది ఆశ్చర్యం కలిగించే విషయం.

నాగచైతన్య మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. సెలెక్టివ్ గా మంచి టేస్టున్న సినిమాలు చేస్తున్నాడు. కానీ మాస్ ఇమేజ్ తెచ్చుకోవడంలో మాత్రం ఫెయిలయ్యాడు. ఈ విషయంలో చైతూ కంటే కూడా అతడి తండ్రి నాగార్జుననే తప్పుబట్టాలి. పెద్ద కొడుకును ‘జోష్’ లాంటి క్లాస్ సినిమాతో లాంచ్ చేయడం తప్పిదమైంది. పైగా ఆ సినిమా ఫ్లాపవడం.. ‘ఏమాయ చేసావె’ లాంటి మరో క్లాస్ మూవీతోనే చైతూ హీరోగా నిలదొక్కుకోవడంతో అతడికి మాస్ ఇమేజ్ రాలేదు. అతను చేసిన మాస్ సినిమాలన్నీ కూడా బోల్తా కొట్టేయడం కూడా మైనస్ అయింది.

ఐతే చైతూ కెరీర్ షేప్ అయిన తీరు చూసి అఖిల్ విషయంలో మాత్రం జాగ్రత్త పడ్డాడు నాగ్. వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ చేతిలో పెట్టడమే కాక.. కుర్రాడిని ముందు నుంచి బాగా ప్రమోట్ చూసి మాస్‌ లోకి దూసుకెళ్లేలా చేశాడు. ఫలితమే ఈ లైకుల వీర విహారం. అఖిల్ సంగతి సరే.. చైతూ ఎప్పటికైనా మాస్ ఇమేజ్ సంపాదించి.. అభిమాన గణాన్ని భారీగా పెంచుకుంటాడా అన్నదే సందేహం.