Begin typing your search above and press return to search.

కాబోయే భార్యలతో నాగ్ వారసులు!

By:  Tupaki Desk   |   6 Nov 2016 6:54 AM GMT
కాబోయే భార్యలతో నాగ్ వారసులు!
X
అక్కినేని నాగార్జున ఇద్దరు వారసులు ఇప్పటికే తమ లవ్ స్టోరీలను చెప్పేశారు. చిన్నోడు అఖిల్ కి అయితే.. ఇప్పటికే నిశ్చితార్ధం కూడా ఖాయం చేసేశారు. నాగచైతన్య-సమంత.. అఖిల్-శ్రేయాభూపాల్ ల పెళ్లిళ్లు ఖాయం అయిపోయాయి. ఇంత జరిగినా.. ఒకటి మాత్రం ఇప్పటివరకూ కనిపించలేదు.

అదే నాగార్జున కొడుకులు-కాబోయే కోడళ్లు కలిసి కనిపించడం. కానీ ఇప్పుడు అఖిల్ నిశ్చితార్ధం పనులు మొదలైపోవడంతో.. అన్నాదమ్ములిద్దరూ తమ కాబోయే భార్యలతో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చారు. చైతు సమంతలు చేతులు పట్టుకుని కనిపించడం.. వెనకాల అఖిల్-శ్రేయా భూపాల్ క్లోజ్ గా పోజ్ ఇవ్వడం సూపర్బ్ గా ఉంది. వదినమ్మతో మరిది అనుబంధం కూడా ఫోటోలో కనిపిస్తోంది. ఇక పక్కన కూర్చున్నా సరే.. చైతు భుజం మీద చేతులు వేసి ఇచ్చిన పోజ్ అయితే.. మొత్తం ఫోటోలో అదరహో అనాల్సిందే.

నాగార్జున వారసులిద్దరూ.. కాబోయే భార్యలతో దిగిన ఫోటో ఇప్పుడు బాగా హైలైట్ అయిపోతోంది. ఈ నలుగురు కలిసి దిగిన మొదటి ఫోటో ఇదే కావడమే ఈ ఫోటోకు హైలైట్ విషయం. ఇక.. నాగ్-అమలలతో కూడా కలిసి ఫోటో దిగడం ఒకటే పెండింగ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/