Begin typing your search above and press return to search.

పోటీ అంతా ప్రొఫెషనల్ గా మాత్రమే

By:  Tupaki Desk   |   20 Sep 2015 7:30 PM GMT
పోటీ అంతా ప్రొఫెషనల్ గా మాత్రమే
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని వంశంలో యంగ్ హీరో అఖిల్.. వీరిద్దరూ దసరా బరిలో నిలుస్తున్నారు. నువ్వానేనా అనే రేంజ్ లో పోటీ నెలకొనడం ఇప్పటికే ఖాయమైంది. అక్టోబర్ 16న బ్రూస్ లీ ది ఫైటర్ ని రామ్ చరణ్ విడుదల చేస్తుంటే.. అక్టోబర్ 22న అఖిల్ లాంఛింగ్ మూవీ థియేటర్ ల లోకి రానుంది.

తమ సినిమాలు ఒకేసారి రిలీజై పోటీ పడపబోతున్నా.. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటున్నాడు అఖిల్. సినిమా రిలీజ్ డేట్ ని సెట్ చేయడంలో ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకూ ఎంతోమంది డబ్బులకి సంబంధించిన అంశాలు ఉంటాయని చెప్పాడు. ఈ విషయంలో చెర్రీ, తాను ఇప్పటికే మాట్లాడుకున్నామని కూడా చెప్పాడు అఖిల్.

పోటీ అంతా ప్రొఫెషనల్ గా మాత్రమేనని.. చిన్నప్పటి నుంచి తామిద్దరం ఫ్రెండ్స్ అని అఖిల్ చెప్పడం విశేషం. అయితే.. పోటీ పడ్డం కోసం ఒకేసారి తమ సినిమాలను రిలీజ్ చేయడం లేదని.. ఇది అనుకోకుండా అలా సెట్ అయిందంటే అంటున్నాడు అఖిల్. బాగుంది కదూ వీరిద్దరి ఫ్రెండ్ షిప్. బయట నుంచి చూసినోళ్లకి అఖిల్ - చరణ్.. బోత్ ఆర్ ఫ్రెండ్స్ అనిపిస్తోంది ఈ మాటలు వింటుంటే.