Begin typing your search above and press return to search.
ఎవరో ఒకరు తగ్గాల్సిందే, ఎందుకీ వార్?
By: Tupaki Desk | 1 Sep 2015 7:43 PM GMTఒకటే యుద్ధం. కానీ వందల ప్రశ్నలు! ఓ స్టార్ హీరో, వేరొక డెబ్యూ హీరో.. ఇద్దరికీ మధ్య కొట్లాటకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. దసరా బరిలో ఈ ఇద్దరి మధ్యా యుద్ధం షురూ అయిపోయింది. అందుకే ఈ ఆసక్తికర టాపిక్. డీప్ గా డీటెయిల్స్ లోకి వెళితే..
స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న 'బ్రూస్ లీ' రిలీజ్ తేదీ అక్టోబర్ 22 అంటూ తాజాగా అప్ డేట్ వచ్చింది. ముందు ప్రకటించిన అక్టోబర్ 16 మిస్ కొడితే కచ్ఛితంగా ఆ తేదీకి రిలీజ్ ఖాయం అంటూ తేదీ కన్ఫమ్ గా చెబుతున్నారు. మరి అలాంటప్పుడు .. వేనవేల ఆశలతో రేసులోకి దూసుకొస్తున్న అక్కినేని నటవారసుడు అఖిల్ పరిస్థితేంటి? 'అఖిల్' రిలీజ్ ని ఆపేసి వెనక్కి తగ్గాల్సిందేనా? అంటే అస్సలు తగ్గే ప్రసక్తే లేదని అఖిల్ తరపు వర్గాలు వాదిస్తున్నాయి. అఖిల్ వెనక్కి తగ్గే ఛాన్స్ లేదు. అతడు దసరా బరిలో వచ్చేస్తున్నాడంతే అని చెబుతున్నారు. అయితే ఇలా పంతం పట్టడం వల్ల ఇద్దరికీ నష్టమే. ఈ రెండు సినిమాలు భారీ క్రేజు తో రిలీజవుతున్నవే. ఇప్పటికే అఖిల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది. 45 కోట్ల మేర రికార్డ్ బిజినెస్ అయ్యింది. చరణ్ బిజినెస్ దాదాపు 60 కోట్లకు చేరుకుంది. అంటే అంత పెద్ద మొత్తాల్ని ఈ రెండు సినిమాలు తిరిగి రికవరీ చేయాలంటే నాలుగు వారాలైనా థియేటర్లలో ఆడాల్సిందే. లేదంటే పెను సమస్యలో కూరుకుపోయినట్టే.
అందుకే ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే పనైపోతుంది. ప్లాన్ ప్రకారం రెండు వారాల గ్యాప్ తో వచ్చినా నష్ట నివారణ చేయొచ్చు. అలా కాకుండా మాటల్లేవ్! మాట్లాడుకోవడాల్లేవ్!! అంటూ లైట్ తీస్కుంటే నష్టం తప్పదు. అప్పట్లో బాహుబలి, శ్రీమంతుడు సెటిల్ చేసుకున్నట్లు ఇప్పుడు వీరు కూడా సెటిల్ చేసుకోవాలి. అయినా చరణ్, అఖిల్ మాంచి స్నేహితులే కదా.. ఏదో ఒకటి సెట్ చేస్తారులే.