Begin typing your search above and press return to search.
అప్పుడే మూడో బ్రాండ్ కొట్టేశాడుగా...
By: Tupaki Desk | 25 Aug 2015 2:44 PM GMTటాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ ఎవరంటే... అఖిల్ అని టక్కుమని చెప్పేయచ్చు. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే.. ఈ అక్కినేని వారసుడు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటివరకూ తండ్రి నాగార్జున కూడా అందుకోని రేంజ్ లో... మొదటి మూవీ మార్కెట్ జరుగుతోందంటే... ఇతగాడి కోసం ఎంతగా ఇండస్ట్రీ, ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారో అర్ధమవుతుంది. ఇప్పుడు మనోడు ఓ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశాడు.
ఇప్పటికే మౌంటెన్ డ్యూ, టైటాన్ లకు అఖిల్ ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు కార్బన్ మొబైల్స్ కూడా సిసింధ్రీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే యాడ్ షూటింగ్ కూడా పూర్తయిపోయిందట. త్వరలో టెలికాస్ట్ కూడా చేయబోతున్నారు. హీరోగా లాంఛింగ్ కూడా కాకముందే నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్ లకు సంతకం చేసిన ఏకైక టాలీవుడ్ స్టార్ అఖిల్ మాత్రమే. ఇప్పట్లో ఈ రికార్డ్ చెరిగిపోకపోవచ్చు. ఇక మూవీ విషయానికొస్తే... వివి వినాయక్ డైరెక్షన్ లో వస్తున్న అఖిల్ డెబ్యూ మూవీకి.. కనీసం 50కోట్ల మార్కెట్ జరుగుతోంది. ఇది కూడా సెన్సేషనల్ రికార్డే.