Begin typing your search above and press return to search.
మాస్.. నాన్నే నేర్పాలి!
By: Tupaki Desk | 23 Jan 2019 5:30 PM GMTఅక్కినేని అఖిల్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారా? డాడ్ నాగార్జున అతడిపై లేనిపోని ఒత్తిడిని పెంచేస్తున్నారా? అంటే అవుననే అఖిల్ మాటల్ని బట్టి అర్థమవుతోంది. సెల్ఫ్ గోల్స్ వేరు.. వేరొకరు నిర్ధేశించిన గోల్స్ వేరు. వాటిని చేరుకోవడం వేరు. ఈ రెండిటికి మధ్య సన్నని లైన్ విషయంలో అఖిల్ కన్ఫ్యూజ్ అవుతున్నట్టే అతడి మాటల్ని బట్టి అర్థమవుతోంది.
కెరీర్ ఆరంభమే `మాస్ హీరో`గా ఎదగాలని అఖిల్ పంతంతో కనిపించాడు. ఆ ప్రయత్న ంలోనే మాస్ డైరెక్టర్ వినాయక్ ని బరిలో దించి అఖిల్ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఫలితం ఏంటో తెలిసిందే. అఖిల్ తన ప్రయత్న లోపం లేకుండా ఎంత ట్రై చేసినా, ఎందుకనో గోల్ పోస్ట్ లో పడలేదు. ఆ తర్వాత కూడా మరోసారి కొత్తగా ప్రయోగాత్మకంగా చేశాడు.. అయినా ఫెయిలైంది. అయితే ఈ ఫెయిల్యూర్స్ నుంచి అఖిల్ నువ్వేం నేర్చుకున్నావ్? అని ప్రశ్నిస్తే అతడి నుంచి అంతే ఆసక్తికరమైన సమాధానమే వినిపించింది.
అఖిల్, హలో సినిమాల అనుభవం .. వాటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మీ నుంచి కొత్తగా ఏం ఆశించవచ్చు? అని ప్రశ్నిస్తే.. ఈసారి ఖాయంగా ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చని అఖిల్ అన్నారు. మిస్టర్ మజ్నులో నా బాడీ లాంగ్వేజ్ .. డిక్షన్, యాక్షన్ .. ప్రతిదీ కొత్తగానే ఉంటాయి. వెంకీ, నేను చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇదే విషయమై ఆడియో ఈవెంట్ లో తారక్ అన్నయ్య చెప్పారు. ఎప్పటికప్పుడు మన పనిలో మనం ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిది. నేను అలాగే విమర్శించుకుంటాను.. అని అఖిల్ ఎంతో పరిణతితో అన్నారు. ఆడియో ఈవెంట్ లో నాన్నగారు ఎన్టీఆర్ నుంచి నేర్చుకోమని సూచించారు కదా? అని ప్రశ్నిస్తే.. మాస్ నేర్చుకోమన్నారు. అదే ఎలా నేర్చుకోవాలో తెలియడం లేదు. ఎలా నేర్చుకోవాలి అనేది నాన్నగారినే అడగాలి... అంటూ నవ్వేశాడు అఖిల్. ఓపెన్ గా నాకు తారక్ అన్నయ్య ఏ కాంప్లిమెంట్స్ ఇవ్వడు. కానీ ఆడియో ఈవెంట్ లో నా గురించి మాట్లాడుతూ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చాడు... అది ఉత్సాహం నింపింది! అని అన్నాడు.