Begin typing your search above and press return to search.
అఖిల్ బాబూ.. నువ్వు మామూలోడివి కాదు
By: Tupaki Desk | 24 July 2015 8:07 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబే స్వయంగా చెప్పేశాడు.. అక్కినేని అఖిల్ లో పెద్ద స్టార్ అయ్యే లక్షణాలున్నాయని. తొలి సినిమా మొదలుపెట్టకముందే మనోడు ఎక్కడికెళ్లినా స్టార్ ను చూసినట్లే చూశారు జనాలు. నాగార్జున కూడా తెలివిగా మాస్ డైరెక్టర్ వినాయక్ కు అఖిల్ అరంగేట్ర బాధ్యత అప్పగించి మంచి నిర్ణయం తీసుకున్నాడు. నాగ్ తీసుకున్న నిర్ణయం ఎంత కరెక్టో ఇప్పుడు అఖిల్ తొలి సినిమాకు జరుగుతున్న బిజినెస్ ను బట్టి తెలుస్తోంది. ఇప్పటిదాకా టాలీవుడ్ చరిత్రలో ఏ అరంగేట్ర హీరో సినిమాకూ జరగనంత బిజినెస్ అఖిల్ సినిమాకు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలకు ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతోందో.. అఖిల్ తొలి సినిమాకు కూడా అదే స్థాయిలో బిజినెస్ అవుతుండటం విశేషం.
అక్టోబరులో సినిమా విడుదల అంటే మూడు నెలల ముందే చాలా ఏరియాల్లో బిజినెస్ అయిపోవడం విశేషం. నైజాం, కర్ణాటక కలిపి ఎన్ఆర్ఏ సంస్థ రూ.18 కోట్లకు రైట్స్ తీసుకుందట. సీడెడ్ కు లక్ష్మీకాంత్ రెడ్డి రూ.6.1 కోట్లకు రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. వైజాగ్ కు రూ.4.5 కోట్లు పశ్చిమ గోదావరికి రూ.2.25 కోట్లు, నెల్లూరుకు రూ.1.6 కోట్లు.. బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మిగతా ఏరియాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఓవర్సీర్ రైట్స్ రూ.4 కోట్లు పలకొచ్చని అంచనా. అన్ని ఏరియాలూ కలుపుకుంటే రూ.43-45 కోట్ల మధ్య అఖిల్ ఫస్ట్ మూవీ బిజినెస్ చేస్తుందని అంచనా. ఇందులో వినాయక్ క్రెడిట్ కూడా ఉన్నప్పటికీ తొలి సినిమాతోనే ఈ స్థాయిని అందుకోవడం మామూలు విషయం కాదు. సినిమా హిట్టయితే అక్కినేని కుర్రాడి రేంజే వేరుగా ఉంటుందేమో మరి.