Begin typing your search above and press return to search.
అఖిల్ సినిమాకి క్రేజీ బిజినెస్
By: Tupaki Desk | 27 July 2015 8:31 PM GMTతెలుగు ఇండస్ట్రీ లో 'బాహుబలి' సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. ప్రతీ ఏరియాలోనూ, ప్రతీ విభాగంలోనూ ఆ సినిమాదే రికార్డు. వాటిని తిరగరాయాలంటే మళ్లీ 'బాహుబలి2'తోనే సాధ్యం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అయితే డెబ్యూ హీరోల విషయంలో మాత్రం అఖిల్ తప్పకుండా కొత్త రికార్డు కొట్టే లా కనిపిస్తున్నాడని అంచనా వేస్తున్నారు.
ఇప్పటిదాకా ఎంతోమంది వారసులు తెరంగేట్రం చేశారు. అయితే తొలి సినిమాతో 40కోట్ల బిజినెస్ చేసిన హీరోలు మాత్రం ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆ రికార్డు అఖిల్ పేరిట నమోదవుతోందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కథానాయకుడు నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో బిజినెస్ కూడా మొదలైనట్టు సమాచారం. ఇప్పటికే 40కోట్ల బిజినెస్ జరిగిందట. ప్రతీ ఏరియాలోనూ స్టార్ కథానాయకుల రేంజ్ లో సినిమాకి బిజినెస్ జరుగుతోందట. ఒక కొత్త హీరో సినిమాకి ఇంత క్రేజీ నెలకొనడం ఇదే తొలిసారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
సినిమాని కూడా రాజీపడకుండా 40కోట్ల వ్యయంతో తీస్తున్నారు. నాగార్జున ఎలాగైనా అఖిల్ కి తొలి సినిమాతోనే మాస్ గుర్తింపు రావాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే వి.వి.వినాయక్ చేతులమీదుగా పరిచయం చేస్తున్నాడు. వినాయక్ స్వతహా గా మాస్ దర్శకుడు కావడంతో ఆయన సినిమాలకి మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అది కూడా అఖిల్ కి ప్లస్సవుతోంది. అక్కినేని కథానాయకుల సినిమాలతో పోలిస్తే అఖిల్ సినిమాకి కనిపిస్తున్న క్రేజ్ ప్రత్యేకంగా ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.