Begin typing your search above and press return to search.
అఖిల్-విక్రమ్ స్పీడప్.. స్పీడప్
By: Tupaki Desk | 23 Feb 2017 10:10 AM GMTఆల్రెడీ ‘అఖిల్’ సినిమా ఫ్లాపైన నేపథ్యంలో అక్కినేని కుర్రాడి కెరీర్ కు పెద్ద బ్రేక్ పడింది. ఈ సినిమా విడుదలకు ముందు అఖిల్ విషయంలో నెలకొన్న పాజిటివ్ బజ్ మొత్తం ఎగిరిపోయింది. అతడి చుట్టూ బోలెడంత నెగెటివిటీ మొదలైంది. రెండో సినిమా విషయంలో మరీ ఎక్కువ టైం తీసుకోవడం.. వంశీ పైడిపల్లి.. హను రాఘవపూడిలతో సినిమాలు దాదాపుగా ఫైనల్ అనుకున్నాక క్యాన్సిల్ చేయడంతో అఖిల్ విషయంలో ఒక రకమైన నెగెటివ్ ఫీలింగ్ పడిపోయింది. ఇంతలో అఖిల్ పెళ్లికి రెడీ అయిపోవడం.. మళ్లీ ఇప్పుడు ఆ పెళ్లి రద్దనడం.. మొత్తంగా అఖిల్ వ్యవహారం అతడి తండ్రి నాగార్జునకు పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ నేపథ్యంలో అఖిల్ వెంటనే సినిమా మొదలుపెట్టకపోతే చాలా కష్టమయ్యేలా ఉంది. అఖిల్ ఇష్టప్రకారమే పెళ్లి రద్దు చేసి ఉన్నప్పటికీ ఈ వ్యవహారం అతడిని మానసికంగా దెబ్బ తీస్తుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో వెంటనే సినిమా మొదలుపెట్టేస్తే ఆ పనిలో పడిపోయి ఈ వ్యవహారం నుంచి అతను బయటపడతాడని.. అతడి విషయంలో మీడియా.. సోషల్ మీడియాలో ఉన్న నెగెటివిటీ కూడా తగ్గుతుందని నాగార్జున భావిస్తన్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ విక్రమ్ కు ఈ విషయంలో సమాచారం కూడా వెళ్లిందట. సాధ్యమైనంత త్వరగా ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలని చెప్పినట్లు సమాచారం. ముందు ఎంత టైం అయినా తీసుకో అని చెప్పిన నాగార్జునే ఇప్పుడు విక్రమ్ ను స్పీడప్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మార్చిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిల్-విక్రమ్ సినిమా మొదలయ్యే అవకాశముంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/