Begin typing your search above and press return to search.
అఖిల్ సూపరంతే!
By: Tupaki Desk | 27 Jun 2015 5:30 PM GMTఅభిమానుల విషయంలో అఖిల్ చూపుతున్న చొరవ అందరినీ ఆకట్టుకుంటోంది. మామూలుగా స్టార్స్ పిల్లలు ఎవరైనా నాలుగైదు సినిమాలు చేశాకే అభిమానుల గురించీ, సంఘాల గురించీ పట్టించుకొంటుంటారు. అంతవరకు తండ్రి చాటు బిడ్డల్లాగే కనిపిస్తుంటారు. అయితే అఖిల్ మాత్రం కథానాయకుడిగా చేస్తున్న తొలి సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకమునుపే అభిమానుల్ని అక్కున చేర్చుకొంటున్నారు. తన గురించీ, తన సినిమాల గురించీ ప్రతీ కదలికని అభిమానులతో పంచుకొంటున్నాడు. అది వాళ్లకు చెప్పలేనంత ఉత్సాహాన్నిస్తోంది.
తాజాగా అఖిల్ థాయ్‌లాండ్‌లో ఉన్నాడు. కొన్ని కీలక సన్నివేశాల్ని అక్కడ తెరకెక్కిస్తున్నారు. అక్కడికి వెళ్లేముందు అఖిల్ ప్రియురాలికి ప్రేమలేఖ రాసినట్టుగా తన అభిమానులకు ఓ లేఖ రాశాడు. సినిమా రిలీజ్‌కి ముందుగానే మిమ్మల్నంతా కలుసుకొంటా అని ఆ లేఖలో చెప్పుకొచ్చాడు. అది చూసి అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నాగార్జునే అభిమానులతో బాగా ఇంటరాక్షన్ అవుతుంటారు. ఆ తర్వాత వాళ్ల కుటుంబంలో ఇంకే కథానాయకుడూ అభిమానులతో ఇంతగా టచ్‌లో ఉండరు. అయితే అఖిల్ మాత్రం ట్విట్టర్లోనూ, ఫేస్‌బుక్‌లోనూ ఎప్పుడూ అభిమానుల గురించే ప్రస్తావిస్తుంటాడు. అందుకే అభిమానులు కూడా అఖిల్ సూపర్ అంటున్నారు.