Begin typing your search above and press return to search.

అఖిల్.. విక్ర‌మ్ సినిమా కోసం ఏం చేస్తున్నాడు?

By:  Tupaki Desk   |   7 Jan 2017 1:32 PM GMT
అఖిల్.. విక్ర‌మ్ సినిమా కోసం ఏం చేస్తున్నాడు?
X
తొలి సినిమా ‘అఖిల్‌’తో గ‌ట్టి ఎదురు దెబ్బ తిన్న అక్కినేని చిన్నోడు అఖిల్.. రెండో సినిమా కోసం బాగానే స‌మ‌యం తీసుకున్నాడు. దాదాపు 15 నెల‌ల విరామం త‌ర్వాత ఈ సంక్రాంతికి త‌న రెండో సినిమాను మొద‌లుపెడుతున్నాడు. ఈ సినిమా కోసం కొన్ని నెల‌ల నుంచి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు అఖిల్. మామూలుగానే కుర్రాడికి ఫిట్ నెస్ మీద‌.. బాడీ మీద శ్ర‌ద్ధ బాగా ఎక్కువ‌. విక్ర‌మ్ సినిమా కోసం స్పెష‌ల్ లుక్ అవ‌స‌రమ‌వ‌డంతో మ‌రింత‌గా శ్ర‌మిస్తున్నాడు. ప్ర‌త్యేకంగా ఒక ట్రైన‌ర్ని పెట్టుకుని బాడీ పెంచే ప‌నిలో ప‌డ్డాడు. విక్ర‌మ్ సినిమా త‌న బాడీ నుంచి చాలా డిమాండ్ చేస్తోందంటూ జిమ్ లో శ్ర‌మిస్తున్న ఫొటో ఒక‌టి ట్విట్ట‌ర్లో షేర్ చేశాడు అఖిల్.

కొన్ని రోజుల పాటు ఎంగేజ్మెంట్ హ‌డావుడిలో ఉండిపోయిన అఖిల్.. ఇప్పుడు పూర్తిగా విక్ర‌మ్ సినిమా ప్రిప‌రేష‌న్ మీదే దృష్టిపెట్టాడు. తొలి సినిమాలో కొంచెం పిల్లాడిలాగే క‌నిపించిన అఖిల్.. విక్ర‌మ్ సినిమా కోసం లుక్ మార్చుకోవాల్సిన అవ‌స‌రం ప‌డింది. సంక్రాంతికే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌నుంది. అఖిల్ కోసం ఒక స్పెష‌ల్ క‌థ‌నే రెడీ చేశాడ‌ట విక్ర‌మ్. ఈ క‌థ గురించి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు అఖిల్. తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న మలయాళ అమ్మాయి మేఘా ఆకాశ్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. అన్నపూర్ణ స్టూడియో బేనర్లోనే ఈ చిత్రం తెరకెక్కనుంది.ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్త‌య్యాక అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/