Begin typing your search above and press return to search.

ఎక్కడ తేడా కొట్టిందబ్బా

By:  Tupaki Desk   |   3 Jan 2018 7:53 AM GMT
ఎక్కడ తేడా కొట్టిందబ్బా
X
ఫస్ట్ మూవీ కంటే చాలా బెటర్ అన్నారు. రివ్యూస్ కూడా బాగా వచ్చాయి. మంచి ఎమోషనల్ లవ్ స్టొరీ అని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. మొదటి రోజు చూసిన ప్రేక్షకులు కూడా అఖిల్ చాలా మెరుగయ్యాడు అని సర్టిఫికేట్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కాని వీటి ఫలితం బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కనిపించడం లేదు. హలో మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అక్కినేని నాగార్జున హలో రూపంలో మరో షాక్ తినక తప్పలేదని ట్రేడ్ లెక్కలు ఋజువు చేస్తున్నాయి. రేపటితో మూడో వారంలోకి ఎంటర్ అవుతున్న హలో పెట్టిన బడ్జెట్ ఇంకా తిరిగి రాలేదు ఒక 60% వెనక్కి వచ్చి ఉండచ్చు అని అంటున్నారు . బిజినెస్ జరిగింది 33 కోట్లు అంటే జస్ట్ సగానికి కొంచెం ఎక్కువ వెనక్కు వచ్చింది. మొత్తం రికవర్ చేయటం అసాధ్యం. చేతిలో ఉన్నది కేవలం ఐదు రోజులే. ఆ లోపు డ్రాప్ అయిన కలెక్షన్ పికప్ కావడం జరిగే పని కాదు.

నటుడిగా అన్ని యాంగిల్స్ లో అఖిల్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనేది నిజం.అఖిల్ సినిమాలో కనిపించిన బెరుకు ఇందులో లేదు. సీనియర్ యాక్టర్స్ తో కూడా చాలా కంఫర్టబుల్ గా యాక్ట్ చేసి డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు. కాని హలో మాత్రం వసూళ్ళ రూపంలో నిరాశనే మిగిల్చింది. బ్లాక్ బస్టర్ కాకున్నా హిట్ అన్నా అవుతుంది ఆనుకున్న ఫాన్స్ కు నిరాశ కలిగిస్తూ చివరికి ప్లాప్ లా మిగిలింది. సింగల్ లైన్ స్టొరీ కావడం - సీరియల్ తరహా ఎమోషన్స్ తప్ప ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే లేకపోవడం సినిమాను దెబ్బ తీసింది. విక్రం కె కుమార్ ఇంత సిల్లీగా ఆలోచించారే అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అఖిల్ పాస్ అయినా సినిమా ఫెయిల్ అవ్వడం పట్ల నాగ్ కొంత అసంతృప్తితో ఉండచ్చు అంటున్నారు. మూడో సినిమాకు రిస్క్ చేయకుండా లిమిటెడ్ బడ్జెట్ లో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చేతిలో పెడితే బెటర్ అని అంటున్నారు ..