Begin typing your search above and press return to search.

ఫైనల్ గా హలోకి నష్టాలు తప్పలేదు

By:  Tupaki Desk   |   20 Jan 2018 11:23 AM GMT
ఫైనల్ గా హలోకి నష్టాలు తప్పలేదు
X
అక్కినేని అఖిల్ మొదటి సినిమా అఖిల్ ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు హలో కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ పరంగా ప్లాప్ అయ్యింది. రెండవ సినిమాతో అయినా అఖిల్ కెరీర్ లో మంచి కలెక్షన్స్ వచ్చే విధంగా చేయాలనీ నాగార్జున చేయని ప్రయోగాలు లేవు. కానీ ఎంత చేసినా కూడా మొదటి రోజులు ప్రేక్షుకులను థియేటర్స్ వరకు రప్పించడం వరకే సక్సెస్ అయ్యాడు.

ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించడంతో మొదట అంచనాలు ఓ రేంజ్ లో కొనసాగాయి. కానీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. దీంతో ఇప్పటి వరకు సినిమా థ్రియేటికల్ రైట్స్ అప్పుడుపోయిన లెక్కల ప్రకారం 61.25% మాత్రమే రికవర్ చేసింది. సినిమా వరల్డ్ వైడ్ థ్రియేటికల్ రైట్స్ రూ.32 కోట్ల ధరకు పలికింది. అయితే టోటల్ గా షేర్ల ప్రకారం సినిమా రూ.19.6 కోట్లను రాబట్టింది.

సినిమాకు ఇంకా రూ.11 కోట్ల వరకు రావాలి. హలో లాభాన్ని ఇవ్వకపోగా ఇంకా అన్ని కోట్ల నష్టాన్ని మిగిల్చింది. కొన్ని ఏరియాల్లో కనీస మాత్రం కలెక్షన్స్ కూడా దాటాకపోవడం గమనార్హం. అన్నపూర్ణ ప్రొడక్షన్ లోనే నాగార్జున ఈ సినిమాను నిర్మించారు. ఇక ఫైనల్ గా కలెక్షన్స్ ప్రకారం అఖిల్ కెరీర్లో హలో మరో ప్లాప్ అని చెప్పవచ్చు. క్రిటిక్స్ అయితే సినిమా బావుందని చెప్పారు గాని ప్రేక్షకులు మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపలేదు. మరి అక్కినేని హీరో నెక్స్ట్ అయినా అందరిని మెప్పించే సినిమాతో వస్తారో లేదో చూడాలి.