Begin typing your search above and press return to search.
అఖిల్ అక్కడ మాత్రం కొట్టాడబ్బా
By: Tupaki Desk | 8 Jan 2018 8:24 AM GMTఅక్కినేని అఖిల్ కొత్త సినిమా ‘హలో’కు చాలా మంచి టాక్ వచ్చింది. కానీ ఆ టాక్ కు తగ్గట్లుగా వసూళ్లు మాత్రం రాలేదు. తొలి సినిమా ‘అఖిల్’ డిజాస్టర్ అయినా సరే.. ‘హలో’ బిజినెస్ అంచనాలకు మించి జరిగింది. దాదాపు రూ.33 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. కానీ బయ్యర్ల పెట్టుబడిని తిరిగి తేవడంలో ‘హలో’ విఫలమైంది. క్రిస్మస్ సెలవుల్ని.. ఇయర్ ఎండ్ హాలిడేస్ ను ‘హలో’ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ చిత్ర ఫుల్ రన్ వసూళ్లు రూ.18 కోట్లు అటు ఇటుగా వచ్చాయంతే. మొత్తానికి టాక్ బాగున్నా ‘హలో’ ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది. అఖిల్ కు మరోసారి నిరాశ తప్పలేదు.
ఐతే తెలుగు రాష్ట్రాల వరకు ‘హలో’ ఫెయిల్యూరే అయినా.. అమెరికాలో మాత్రం ఇది హిట్టే. రూ.3 కోట్లకు ‘హలో’ ఓవర్సీస్ హక్కుల్ని అమ్మారు. అక్కడ ఈ చిత్రం మిలియన్ డాలర్ వసూళ్లతో బయ్యర్ కు లాభాలు అందించింది. రెండో వారాంతానికే 8 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఎట్టకేలకు మిలియన్ క్లబ్బును కూడా అందుకుంది. గత రెండు వారాల్లో వచ్చిన సినిమాలన్నింట్లో ఈ వీకెండ్లో ఎక్కువ వసూళ్లు రాబట్టింది ‘హలో’ చిత్రమే. విక్రమ్ కుమార్ కు యుఎస్ లో మంచి మార్కెట్ ఉంది. అతడి గత సినిమాలు ఇక్కడ చాలా బాగా ఆడాయి. యుఎస్ తెలుగు ప్రేక్షకుల టేస్టుకు తగ్గ క్లాస్ లవ్ స్టోరీ కావడం దీనికి కలిసొచ్చింది. ఐతే ఇలాంటి ఫలితమే తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చి ఉంటే అక్కినేని ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉండేది.