Begin typing your search above and press return to search.
హలో.. అఖిల్ టార్గెట్ 32+ కోట్లు
By: Tupaki Desk | 14 Dec 2017 5:02 AM GMTఅక్కినేని అఖిల్ సెకండ్ ఫిల్మ్ హలో తో ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ మార్కెట్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు. డిసెంబర్ 22న నాని సినిమా పోటీకి ఉన్నా కూడా మినిమమ్ 40 కోట్ల క్లబ్ లో చేరాలని టార్గెట్ పెట్టుకున్నాడు. నాగార్జున సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాడు. టార్గెట్ కి తగ్గట్టుగా రిలీజ్ చేస్తున్నాడు గాని సినిమా రిజల్ట్ ని బట్టి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏ మాత్రం కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా స్థాయి చాలా వరకు పెరుగుతుంది.
హలో సినిమా మొత్తంగా వరల్డ్ వైడ్ థ్రియేటికల్ రైట్స్ రూ.32 కోట్ల ధర పలికింది. అఖిల్ మొదటి సినిమాకంటే ఈ ప్రైజ్ చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాకు 42 కోట్లు వచ్చాయి. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వస్తుండడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మొదటి వారం సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత సినిమా టాక్ ని బట్టి మంచి షేర్స్ వచ్చే అవకాశం ఉంది. సినిమా నైజాం ఏపీ లలో టోటల్ గా రూ.26.5 కోట్లకు పలుకగా కర్ణాటకలో రూ.2 కోట్లు వచ్చాయి. అలాగే ఓవర్సీస్ లో 3+ కోట్లకు సినిమా అమ్మడుపోయింది..
ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు రూ.40+ కోట్ల షేర్స్ అందించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ సినిమాలో తేడా వస్తే మొదటికి మోసం వస్తుంది. నాగార్జున మాత్రం అఖిల్ సినిమాను కొంచెం హై బడ్జెట్ లోనే తెరకెక్కించి రిలీజ్ చేస్తున్నాడు. అయినా కూడా హిట్ టాక్ వస్తే ఈ 32 కోట్లకు రికవర్ చేయడం పెద్ద కష్టం కాదులే. విక్రమ్ డైరక్షన్లో అఖిల్ మరియు కళ్యాణి హీరోహీరోయిన్లు రూపొందిన 'హలో' సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.