Begin typing your search above and press return to search.

అఖిల్ బాబు నేల మీద నడవడా?

By:  Tupaki Desk   |   5 Sept 2017 3:36 PM IST
అఖిల్ బాబు నేల మీద నడవడా?
X
అక్కినేని అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ యాక్షన్ ప్రధానంగా సాగింది. దాని ఫలితమేంటో తెలిసిందే. ఈసారి కుర్రాడు రూటు మారుస్తాడనుకుంటే మళ్లీ పక్కా యాక్షన్ సినిమానే చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రేమకథలకు ఫేమస్ అయిన విక్రమ్ కుమార్ అఖిల్ తో పక్కా యాక్షన్ సినిమానే చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సినిమాకు ప్రేక్షకుల్ని ముందే ప్రిపేర్ చేయడానికేనో ఏమో.. వరుసగా ‘యాక్షన్’ స్టిల్సే బయటికి వదులుతున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ లో అఖిల్ ఓ వైపు అమ్మాయితో రొమాన్స్ చేస్తూనే.. మరోవైపు రౌడీల్ని చితకబాదుతున్న తీరు చూశాం. అందులో అతను గాల్లోకి ఎగురుతూ కనిపించాడు. ఇక ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో అఖిల్ ఓ బిల్డింగ్ మీది నుంచి తల్లకిందులుగా గాల్లోకి ఎగురుతున్న దృశ్యం చూశాం.

ఇక తాజాగా అఖిల్ రెండో సినిమాకు సంబంధించి మరో స్టిల్ బయటికి వచ్చింది. అందులో వెనుక విలన్లు తరుముతుంటే అఖిల్ గోడమీదుగా గాల్లోకి ఎగురుతూ కనిపిస్తున్నాడు. వరుసగా ఈ పోస్టర్లు చూసిన జనాలు.. అఖిల్ బాబు అసలు నేల మీద నడవడా.. అతనేమైనా స్పైడర్ మ్యానా.. సూపర్ మ్యానా.. అని చర్చించుకుంటున్నారు. మరి ప్రేక్షకులందరూ సెన్సిబుల్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడుతున్న ఈ రోజుల్లో అఖిల్-విక్రమ్ పక్కా యాక్షన్ సినిమా చేయడంలో ఆంతర్యమేంటో.. ఇందులో అంత విశేషం ఏముందో చూడాలి. ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.