Begin typing your search above and press return to search.
ఒట్టు.. హలో సూపర్ హిట్టు!!
By: Tupaki Desk | 8 March 2018 7:07 AM GMTఅఖిల్ అక్కినేని హీరోగా నటించిన సెకండ్ మూవీ హలో. మొదటి సినిమా నిరుత్సాహపరిచిన తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ చేసిన మూవీ హలో. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. రిలీజ్ రోజు మొదటి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. మౌత్ టాక్ బాగున్నా.. రివ్యూలు ఎంత పాజిటివ్ గా వచ్చినా.. చివరకు కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది హలో.
ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో ప్రొడ్యూసర్ నాగార్జున స్వయంగా రిలీజ్ చేసుకున్నాడు. ఆశ్చర్యంగా ఇక్కడ మాత్రం మంచి హిట్ సాధించింది ఈ మూవీ. ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయింది. అఖిల్ తొలి చిత్రంతో పోల్చితే.. ఈ సినిమాకు ఏకంగా 6 రెట్లకు పైగా వసూళ్లు దక్కడం గమనించాల్సిన విషయం. ఈ మిలియన్ డాలర్స్ లో సగం మాత్రమే డిస్ట్రిబ్యూటర్ షేర్ గా వచ్చింది. సహజంగా 55 శాతం వరకూ ఈ షేర్ వస్తుంది కానీ.. హలోను ఏఎంసీ రిలీజ్ చేయడంతో ఎక్స్ పెండిచర్ చాలా ఎక్కువ అయింది. అయితే.. వీరి ద్వారా విడుదల చేయడం మాత్రం సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి.
పక్కనే నాని మూవీ ఎంసీఏ పోటీ ఉన్నా.. చెప్పుకొదగ్గ సంఖ్యలో థియేటర్లు దక్కాయి. హలో 1 మిలియన్ డాలర్స్ ను క్రాస్ చేసి హిట్ అనిపించుకోవడంలో.. గ్రాండ్ రిలీజ్ కూడా కారణంగా చెప్పాలి. ఇక్కడ డిజాస్టర్ అనిపించుకున్నా.. ఓవర్సీస్ లో మాత్రం హలో సూపర్ హిట్టే.