Begin typing your search above and press return to search.

అఖిల్ కు హీరోయిన్ సెంటిమెంట్‌

By:  Tupaki Desk   |   23 April 2018 10:55 AM GMT
అఖిల్ కు హీరోయిన్ సెంటిమెంట్‌
X
స్టార్ హీరో కొడుకు అఖిల్‌. ఎంత బ్యాక్‌ గ్రౌండ్ ఉన్నా హిట్ కొట్టాలంటే మాత్రం అదృష్టం కూడా క‌లిసి రావాల‌న్న‌ది అత‌ని విష‌యంలోనే రుజువైంది. మొద‌టి సినిమా అఖిల్ అట్ట‌ర్ ఫ్లాప్‌. రెండో సినిమా హ‌లో అంతంత మాత్రం ఆడినా హిట్ లిస్టులో మాత్రం ప‌డ‌లేదు. ఇప్పుడు అఖిల్ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మూడో సినిమా కూడా ఆడ‌క‌పోతే ఫ్లాప్‌ హీరో అని పేరు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుంది. అందుకే త‌న ప‌క్క‌న న‌టించే హీరోయిన్ విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ట‌. సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడ‌ట‌.

అఖిల్ మొద‌టి సినిమా సాయేషాను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశారు. రెండో సినిమాలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ని ప‌రిచ‌యం చేశారు. ఇద్ద‌రూ కొత్త హీరోయిన్లే. అయినా సినిమా ఆడింది లేదు. అందుకే త‌న మూడో సినిమాలో మాత్రం అఖిల్ కొత్త హీరోయిన్ జోలికి పోవ‌డం లేద‌ని తెలుస్తోంది. వ‌రుస హిట్లు ఉన్న హీరోయిన్‌ ని తీసుకుంటే త‌న‌కూ క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తున్నాడ‌ట అఖిల్‌. టాలెంట్ క‌న్నా సెంటిమెంట్‌ కే ఎక్కువ విలువ ఇస్తున్నాడ‌ట‌. ఆ మ‌ధ్య ఛ‌లో హీరోయిన్ ర‌ష్మిక మండ‌న్నా అఖిల్ ప‌క్క‌న ఎంపికైంద‌న్న టాక్స్ వినిపించాయి. కానీ ఇంత‌వ‌ర‌కు క్లారిటీ రాలేదు. మ‌రి అఖిల్ ప‌క్క‌న న‌టించే ఆ స‌క్సెస్‌ ఫుల్ హీరోయిన్ ఎవ‌రో చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించేవ‌ర‌కు తెలియ‌దు.

ప్ర‌స్తుతం అఖిల్ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ ఎల్‌ పి పతాకంపై వెంకీ అట్లూరి ద‌ర్శ‌కత్వంలో త‌న మూడో సినిమాకు కొబ్బ‌రికాయ కొట్టాడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. వెంకీ అట్లూరి తొలిప్రేమ సినిమాతో తొలిహిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా న‌చ్చే నాగార్జున పిలిచి మ‌రీ అఖిల్ సినిమాను అందించిన‌ట్టు తెలుస్తోంది. వెంకీ అట్లూరి అయినా అఖిల్‌కు ఓ హిట్‌ను అందిస్తాడో లేదో చూడాలి.