Begin typing your search above and press return to search.
అఖిల్ తో అనసూయ డేటింగ్
By: Tupaki Desk | 6 Aug 2016 9:23 AM GMTఅనసూయతో అఖిల్ డేటింగా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ! ఈ డేటింగ్ ఓ టీవీ షో కోసమేనండీ. ఓ ప్రముఖ ఛానల్ ఎ డేట్ విత్ అనసూయ పేరుతో ఓ షో నిర్వహిస్తోంది. అందులో అనసూయతో కలిసి సెలెబ్రిటీలు సరదాగా మీటింగ్ డేటింగ్ చేస్తారన్నమాట. అ మీటింగ్ లో చెప్పుకొనే కబుర్లు - చోటు చేసుకొనే సరదాలన్నీ టీవీలో ప్రసారమవుతాయన్నమాట. తొలిసారి ఆ షోలో అఖిల్ అక్కినేని పాల్గొన్నాడు. అందులో అఖిల్ తన ఫ్రెండ్స్ - డేటింగ్ వివరాలు - చేతిపై ఉన్న టాటూ - ఇండస్ట్రీ కబుర్లు - త్వరలో చేయనున్న రెండో సినిమా... ఇలా అన్ని విషయాల్నీ బయటపెట్టినట్టు తెలుస్తోంది. మరి అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాల్ని కూడా బయపెట్టాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అఖిల్ ఈమధ్యే ఓ అమ్మాయిని ప్రేమించాడని - పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలొచ్చాయి. నాగార్జునకి కూడా అఖిల్ ప్రేమ విషయం తెలుసని ఆమధ్య చెప్పుకొన్నారు. అయితే ఆ వార్తలు బయటికొచ్చినప్పట్నుంచి అఖిల్ మీడియా మధ్యకి రాలేదు. తొలిసారి ఎ డేట్ విత్ అనసూయ షోలో పాల్గొన్నాడు. ఆ షోలో అనసూయ అఖిల్ కి సంబంధించిన బోలెడన్ని విషయాల్ని బయటికి లాగే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. మరి అఖిల్ తన లవ్ స్టోరీని బయటపెట్టాడా లేదా అనేది తెలియాలంటే షో చూడాల్సిందే.