Begin typing your search above and press return to search.

ఇక అమ్మాయిల మ‌న‌సు కొల్ల‌గొడ‌తాడు

By:  Tupaki Desk   |   20 Nov 2015 5:16 AM GMT
ఇక అమ్మాయిల మ‌న‌సు కొల్ల‌గొడ‌తాడు
X
అక్కినేని అఖిల్‌ని తొలి సినిమాతోనే సూప‌ర్‌ స్టార్‌ ని చేయాల‌న్న ప్ర‌య‌త్నంలో త‌డ‌బాటు ఎదురైంద‌న్న‌ది వాస్త‌వం. తొలి ఎటెంప్ట్‌ కొంత మిస్ ఫైర్ అయ్యింద‌నే చెప్పాలి. అయితే న‌టుడిగా అఖిల్‌ లోని ట్యాలెంటును ఆవిష్క‌రించ‌డంలో వినాయ‌క్ స‌క్సెస‌య్యారు. డ్యాన్సులు - ఫైట్స్‌ లో అఖిల్ ఇర‌గ‌దీశాడ‌న్న పేరొచ్చింది. అందుకే అఖిల్ మూవీ జ‌యాప‌జ‌యాల‌తో ప‌నిలేకుండా అత‌డికి వెంట‌వెంట‌నే ఆఫ‌ర్స్ క్యూక‌డుతున్నాయిప్పుడు. ఇటీవ‌లే గోవా ట్రిప్ వెళ్లిన అఖిల్ టూర్ ముగించుకుని త‌న రెండో సినిమాపైనా పూర్తి స్థాయిలోనే క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టేశాడు.

ఇప్ప‌టికే యంగ్ డైరెక్ట‌ర్ ల‌కు మాంచి రొమాంటిక్ ల‌వ్‌ స్టోరీలు ఉంటే చెప్పండ‌ని హింట్ ఇచ్చేశాడు. ప్ర‌స్తుతం కొంద‌రు యువ‌ద‌ర్శ‌కులు అఖిల్ కోసం డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీల్ని ప్రిపేర్ చేస్తున్నార‌ని స‌మాచారం. అన్న నాగ‌చైత‌న్య బాట‌లోనే అఖిల్ కూడా ఇప్పుడు రొమాంటిక్ కామెడీల వైపు మొగ్గు చూపిస్తున్నాడు. అంటే. .. ఏమాయ చేశావే త‌ర‌హాలోనే రెండో సినిమాతో హిట్ కొట్టి ట్రాక్ లోకి రావాల‌న్న‌ది అఖిల్ ప్లాన్ అయ్యి ఉంటుంది. మంచి ఆలోచ‌నే. త‌న శ‌రీర‌భాష‌కు రొమాంటిక్ ల‌వ్‌ స్టోరీలు - రొమాంటిక్ కామెడీలో బాగా సూట‌వుతాయ్‌. రెండో సినిమా డీటెయిల్స్ త‌నంత‌ట తాను చెప్పే వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.