Begin typing your search above and press return to search.
అఖిల్ మాట.. నాకే ఇమేజ్ వద్దు
By: Tupaki Desk | 7 Nov 2015 11:30 AM GMTతాను ఎలాంటి ఇమేజ్ కోరుకోవట్లేదని.. తన మీద ఇప్పుడే ఓ ముద్ర వేసేయొద్దని.. తాను అన్ని రకాల పాత్రలూ చేయాలనుకుంటున్నానని అంటున్నాడు అక్కినేని కుర్రాడు అఖిల్. మల్టీస్టారర్లకు తాను సిద్ధమని.. కెరీర్ ఆరంభంలో ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయాలనుకోవట్లేదని.. హడావుడి పడకుండా ఒక దాని తర్వాత ఒక సినిమా చేస్తానని అఖిల్ చెప్పాడు. ‘అఖిల్’ ప్రమోషన్ లలో భాగంగా శనివారం అతను విలేకరులతో చేసిన చిట్ చాట్ విశేషాలు మీకోసం..
- నాకు ఇప్పుడప్పుడే ఎలాంటి ఇమేజ్ వద్దు. అన్నీ చేయగలనని అనిపించుకోవాలి. అందుకే ముందు నేను ఇలాంటి కథను ఎంపిక చేసుకున్నాను. నేనిప్పుడు ఎస్టాబ్లిషింగ్ స్టేజ్ లో ఉన్నా. అందుకే నాలుగైదు ఏళ్ళు ఒక సినిమా తర్వాతే మరో సినిమా చేస్తా. తెలుగు నాకు హోమ్. ఇక్కడ బాగా సెటిలయ్యాక ఇంకో భాష గురించి ఆలోచిస్తా. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ నాకు తెలుగులో ఇప్పుడు దృష్టి పెట్టాలని ఉంది. ఈ సినిమా చేసేటప్పుడు బ్రహ్మానందం గారిని చూడగానే నవ్వేసేవాడిని. సో నా నెక్స్ట్ సినిమా నుంచి కామెడీ విషయంలో కాసింత ఎక్కువ దృష్టి పెట్టాలి.
* కెరీర్లో అన్ని రకాల సినిమాలు చేస్తా. ప్రయోగాత్మక సినిమాలు కేవలం నాకోసం, నన్ను ప్రూవ్ చేసుకోవడం కోసం చేయను. ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటే మాత్రమే చేస్తా. నాతో పాటు మరో హీరో ఓకే అంటే మల్టీస్టారర్లకు నేను సిద్ధం. దాని వల్ల మార్కెట్ పెరుగుతుంది. నాకు స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లోనూ సినిరమాలు చేయాలనుంది. ఐతే వాటిని అథెంటిక్ గా తీసే దర్శకుడు కావాలి. లేదంటే నవ్వుల పాలైపోతాం. తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో రాజమౌళి సై మాత్రమే నాకు అలాంటి సినిమా అనిపించింది.
* అఖిల్ షూటింగ్ లో భాగంగా నేను స్పృహ తప్పి పడిపోయానని ప్రచారం జరిగింది. అది నిజం కాదు. నాకు జస్ట్ కళ్లు తిరిగాయంతే. నేనప్పుడు యాబ్స్ కోసం స్ట్రిక్ట్ డైట్ లో ఉన్నా. నీళ్ళు కూడా ఎక్కువగా తాగలేదు. దీనికి తోడు హెవీ రిహార్సల్స్ చేయడం వల్ల కాసింత కళ్ళు తిరిగినట్లు అనిపించింది. అంతే తప్ప నేను పూర్తిగా ఏమీ పడిపోలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా ఈ విషయాన్ని రెండు రోజుల తర్వాతే చెప్పా.
* సినిమాలో టిపికల్ వినాయక్ హీరో ఎలా ఉంటాడో నేనూ అలాగే ఉంటా. అన్ని అంశాలూ కలగలిసిన సినిమా ఇది. ఎక్కడా ఏదీ ఎక్స్ ట్రాగా అనిపించదు. కాకపోతే నా ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుంది.
* నా ఇంట్రడక్షన్ సాంగ్ 5 నిమిషాల పాటు ఉంటుంది. ప్రేక్షకులకు నన్ను పరిచయం చేసే పాట అది. అందుకే కాస్త పెద్దగా పెట్టాం. జానీ మాస్టర్ నాతో అద్భుతమైన స్టెప్పులు వేయించారు. 12 రోజులు రోజుకు 17-18 గంటల పాటు కష్టపడి ఈ పాటను షూట్ చేశాం.
* నితిన్ ఈ కథను, వినాయక్ గారిని తీసుకొచ్చినప్పుడే నాకు నమ్మకం కుదిరింది. వెంటనే నాన్నగారితో చెప్పాను. ఆయనా మొత్తం విని అంతా సెట్ చేశారు. ఈ తరహా సినిమా తెలుగు తెరపై ఇటీవలి కాలంలో రాలేదని మాత్రం గట్టిగా చెప్పగలను.
* 80 రోజులు షూటింగ్ చేస్తే అందులో 60 రోజులు విదేశాల్లోనే షూట్ జరిగింది. స్పెయిన్ లో ఇంటర్వెల్ ఫైట్ - ఛేజ్ లు తీశాం. నాకు బేసిగ్గా యాక్షన్ చేయడమంటే ఇష్టం. అందుకే ఈ సినిమాలో అండర్ వాటర్ స్టంట్ - ప్లేన్ లో ఓ స్టంట్ - పాంథర్ ఫైట్ లాంటివన్నీ చేశాం.
* మామూలుగా నిర్ణయాలు ఏవైనా నేను - నాన్న కలిసి తీసుకుంటాం. అమ్మ సలహా ఇస్తుంది. డ్యాన్స్ అంటే అమ్మకు చాలా ఇష్టం. ఆ విషయంలో మాత్రం తన సజెషన్స్ తీసుకుంటా. మా తాతగారు ఏం చెప్పారంటే ఆయన చెప్పిన దాన్ని ఒక్క మాటలో చెప్పలేను. అలాంటి లెజండరీ పర్సనాలిటీ జీవితమంతా నాకు పాఠమే.
* నాకు ఇప్పుడప్పుడే ఎలాంటి ఇమేజ్ వద్దు. అన్నీ చేయగలనని అనిపించుకోవాలి. నాలుగైదేళ్లు ఒక సినిమా తర్వాత ఒకటి చేస్తా. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ నాకు ఇప్పుడు తెలుగు మీదే దృష్టిపెట్టాలనుంది.