Begin typing your search above and press return to search.

తప్పుల నుంచి నేర్చుకుంటా: అఖిల్

By:  Tupaki Desk   |   24 Jan 2019 1:30 AM GMT
తప్పుల నుంచి నేర్చుకుంటా: అఖిల్
X
అఖిల్ అక్కినేని మూడో చిత్రం 'Mr. మజ్ను' శుక్రవారం నాడు విడుదల కానుంది. దీంతో అఖిల్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి.. 'Mr.మజ్ను' గురించి చాలా విషయాలు పంచుకున్నాడు. వెంకీ అట్లూరి ఈ కథను మీకోసమే రాశాడు కదా అని అడిగితే.. అవునని తన డెబ్యూ సినిమాకోసం విన్న కథల్లో ఇదొకటని తెలిపాడు. ఈ కథను నీకోసమే రాశానని నీతోనే తెరకెక్కిస్తానని వెంకీ అట్లూరి తనతో అనేవాడట. అలానే ఇన్నేళ్ళు తనకోసమే ఆగి ఆ కథను 'Mr. మజ్ను' రూపంలో తెరకెక్కించాడని తెలిపాడు. వెంకీ అట్లూరి తనకు పదేళ్ళ నుండి తెలుసన్నాడు.

హీరోగా మూడు సినిమాల అనుభవం గురించి అడిగితే మొదటి సినిమాకు ప్రెజర్ ఉండేదని.. రెండో సినిమాకు అది డబల్ అయిందని చెప్పాడు. కానీ ఈ సినిమాకు మాత్రం అలాంటిదేమీ లేదని సినిమాను సినిమాలా చేశామని.. తనకు ఇదే మొదటి సినిమాలా అనిపించిందన్నాడు. ఇకపై ప్రేమకథలే చేస్తారా అని ఆడిగితే.. అన్ని జోనర్లలో సినిమాలు చేయాలని ఉందని.. కాకపోతే వయసు తక్కువ కాబట్టి మరో ఐదేళ్ళ పాటు లవ్ స్టోరీస్ ఎక్కువ చేస్తానని తెలిపాడు. ఈ సినిమాలో పాత్రకు మీ నిజ జీవితానికి ఏమైనా పోలికలున్నాయా అని అడిగితే.. నేను మజ్నుని కాదని.. నా చుట్టు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా ఉంటారని అన్నాడు.

ఎయిట్ ప్యాక్ లుక్ గురించి అడిగితే.. ఈ సినిమాలో ఒక పాట స్పెషల్ గా ఉండాలని ఆలోచిస్తూ ఉన్న సమయంలో శేఖర్ మాస్టర్ 8-ప్యాక్ చేస్తే బాగుంటుందని ఐడియా ఇచ్చారు.. ఆ సూచన నచ్చడంతో ఫాలో అయ్యామని అన్నాడు. తనకు మల్టిస్టారర్ సినిమాలు చేయాలని ఉందని.. ఇద్దరు ముగ్గురు హీరోలు కాదు.. ఐదారు మంది హీరోలుంటే ఇంకా బాగుంటుందని చెప్పాడు. మొదట చేసిన సినిమాల గురించి మాట్లాడుతూ మొదటి సినిమా పెద్ద ఫ్లాప్ కావడం వల్ల ఎంతో నేర్చుకున్నానని.. ఆ పరాజయంతో స్ట్రాంగ్ అయ్యానని తెలిపాడు. ఎన్టీఆర్ చెప్పినట్టు నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకుంటానని.. తప్పుల నుంచి నేర్చుకుంటానని అన్నాడు. తన నెక్స్ట్ ఫిలిం గురించి ఫిబ్రవరిలో ప్రకటిస్తానని తెలిపాడు.