Begin typing your search above and press return to search.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఏం చెప్పబోతున్నాడంటే..?

By:  Tupaki Desk   |   12 Oct 2021 1:30 PM GMT
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏం చెప్పబోతున్నాడంటే..?
X
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యూత్ కింగ్ అఖిల్ అక్కినేని - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ఎలిజిబుల్ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 15న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరంగా సాగుతున్నాయి.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ - పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. సినిమాలో పాత్రల్ని క్యూట్ గా లవ్ లీగా డిజైన్ చేసే దర్శకుడు భాస్కర్.. ఈ చిత్రంలో కూడా అన్ని పాత్రలను అందరిని ఆకట్టుకునేలా డిజైన్ చేసారని తెలుస్తోంది. అలానే ఈ సినిమా ద్వారా ఓ సరికొత్త పాయింట్ ని చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

ఓ పెళ్లి జరగాలంటే అమ్మాయి అందంగా ఉండాలి.. అమ్మాయికి ఆస్తులు ఉండాలి.. లేదా అబ్బాయి అందంగా ఉండాలి.. బాగా సెటిల్ అయ్యుండాలి.. వంటివి ప్రామాణికాలు కాదని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో చెప్పబోతున్నారట. పెళ్లి చేసుకోవాలంటే అసలు నిజంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి? పెళ్లి కి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి? అనే మెయిన్ పాయింట్స్ తో ఈ సినిమా తెరకెక్కెందని టాక్.

అయిదే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఇదే కనుక నిజమైతే కాస్త అటుఇటుగా ఈ స్టోరీ లైన్ తో ఇప్పటికే 'షాదీ ముబారక్' అనే సినిమా వచ్చింది. కాకపోతే ఇంత డెప్త్ గా వాళ్లు వెళ్లలేదు. అంతేకాదు 'వరుడు కావలెను' కూడా ఇదే లైన్ అనే టాక్ ఉంది. ఏదేమైనా దర్శకుడు భాస్కర్ ఎలాంటి లైన్ తీసుకున్నా దాన్ని స్క్రీన్ మీద అందంగా ఆవిష్కరించగలరని చెప్పవచ్చు. ఆయన గత చిత్రాలు 'బొమ్మరిల్లు' 'పరుగు' 'ఆరెంజ్' పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది.

కాగా, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో అఖిల్ -పూజా హెగ్డే లతో పాటుగా ఆమని - ఈషా రెబ్బా - ఫారియా అబ్దుల్లా - మురళీ శర్మ - చిన్మయి - వెన్నెల కిషోర్ - జయప్రకాష్ - అజయ్ - ప్రగతి - అమిత్ తివారి - పోసాని కృష్ణ మురళి - శ్రీకాంత్ అయ్యంగార్ - అభయ్ - సుడిగాలి సుధీర్ - గెటప్ శీను తదితరులు నటిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.