Begin typing your search above and press return to search.

అఖిల్ ఒక రోజు ముందుకొచ్చాడు

By:  Tupaki Desk   |   17 Sep 2015 8:10 AM GMT
అఖిల్ ఒక రోజు ముందుకొచ్చాడు
X
నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ మూవీ ఆడియో ఫంక్షన్ రిలీజ్ డేట్ ఫైనల్ అయింది. ముందుగా అనుకున్న డేట్ కంటే ఒక రోజు ముందే వచ్చేస్తున్నాయి అఖిల్ పాటలు. ఇప్పటివరకూ తెలుగులో ఏ సినిమాకి జరగనంత ఆడంబరంగా.. ఆడియో రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్ నితిన్ రెడీ అయిపోయాడు.

ఓ ఫంక్షన్ హాల్ నో - ఆడిటోరియంనో - స్టార్ హోటల్ నో ఫిక్స్ చేస్తారు ఆడియో రిలీజ్ కి. కానీ ఏకంగా గచ్చీబౌలీ ఇండోర్ స్టేడియంలో అఖిల్ పాటలు వేడుక జరగనుంది. అయితే ముందుగా సెప్టెంబర్‌ 21న అనుకున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం ఆ ప్రోగ్రాం సెప్టెంబర్‌ 20 సాయంత్రానికి ప్రీ పోన్‌ అయ్యింది. సాయంత్రం 6 నుంచి ప్రోగ్రాం అంటూ.. ఓ మాంచి స్టిల్ ఇచ్చిన అఖిల్ ఫోటోతో పోస్టర్స్ వేశారు. స్టిల్‌ అదుర్స్‌ అంతే.

అఖిల్ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. తమన్ - అనూప్ రూబెన్స్ పాటలను పంచుకోగా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మణిశర్మ ఇస్తున్నాడు ఈ చిత్రానికి. పాటలతోనే సగం హిట్ సాధించాలనేది డైరెక్టర్ వివి వినాయక్ ఐడియా. సాయేషా సైగల్ ఈ మూవీలో హీరోయిన్. అక్టోబర్ 22న రిలీజ్ కానున్నాడు అఖిల్.