Begin typing your search above and press return to search.
ఆ సినిమా బడ్జెట్.. ఈ కుర్రాడి మార్కెట్
By: Tupaki Desk | 25 July 2015 1:52 PM GMTనాగార్జున కెరీర్ లో ది బెస్ట్ మూవీ 'మనం'. అక్కినేని త్రయం ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇకపోతే మనం వసూలు చేసినంత పెట్టుబడిని కేవలం అఖిల్ డెబ్యూ సినిమా కోసం ఖర్చు చేశారంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ అవాక్కయ్యే వాస్తవం ఇది.
స్టార్ హీరోగా మూడు దశాబ్ధాలుగా కెరీర్ ని సాగిస్తున్న నాగార్జున కే సాధ్యం కాని ఫీట్, ఒక స్టార్ కిడ్ గా తొలి సినిమాతోనే సాధించేశాడు అఖిల్. ఇంకా సినిమా రిలీజవ్వకుండానే 40కోట్ల మార్క్ వ్యాపారం పూర్తి చేసుకున్నాడని తెలుస్తోంది. అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి నితిన్ నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అఖిల్ ఛరిష్మా, మహేష్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోల ఛరిష్మాలా పని చేస్తుండడం విశేషం. పైగా వినాయక్ బ్రాండ్ ఈ మార్కెట్ మాయాజాలానికి కలిసొచ్చింది. అఖిల్ ఛరిష్మా, వినాయక్ బ్రాండ్ వాల్యూ, నాగార్జున-నితిన్-సుధాకర్రెడ్డిల బ్యాకప్ అఖిల్ ని ఓ రేంజుకి తీసుకెళ్లాయి.
ఒక స్టార్ హీరోగా నాగార్జున మార్కెట్ రూ.20 కోట్ల లోపే. నాగచైతన్య రేంజ్ రూ.10-15కోట్ల మధ్య డీవియేట్ అవుతోంది. కాని ఇంకా తన తొలి సినిమా రిలీజ్ కాకముందే 40కోట్ల మార్కెట్ తెచ్చుకున్నాడు అఖిల్. ఇంటా బైటా అతడిపైనే అందరి కళ్లు ఉన్నాయి కాబట్టి ఓవర్సీస్ లోనూ మహేష్ అంతటి మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడని టాక్. ఈ ఓవర్ హైపులో పడి హిట్టు కొట్టడం మర్చిపోకుండా ఉంటే చాలు.