Begin typing your search above and press return to search.

దెబ్బకి క్రేజ్‌ డబుల్‌ అయిపోయింది

By:  Tupaki Desk   |   9 Nov 2015 1:30 PM GMT
దెబ్బకి క్రేజ్‌ డబుల్‌ అయిపోయింది
X
అక్కినేని అఖిల్ న‌టించిన అఖిల్ చిత్రం ఈనెల 11న దీపావ‌ళి కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌ - ఏపీల్లో బ్యాలెన్స్‌డ్‌ గా ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్‌ లో పాల్గొంటున్నాడు అఖిల్‌. త‌న మొద‌టి సినిమా ప్ర‌మోష‌న్‌ ని చాలా తెలివిగా చేస్తున్నాడు.

రిలీజ్‌కి నెల రోజుల ముందే అమెరికా వెళ్లి ఓవ‌ర్సీస్ మార్కెట్‌ ని ట‌చ్ చేసి వ‌చ్చాడు. అభిమానుల్ని ద‌గ్గ‌ర్నుంచి ట‌చ్ చేశాడు కాబ‌ట్టి విదేశాల్లో చ‌క్క‌ని మార్కెట్ అందుకున్నాడు. అలాగే ఇటీవ‌లి కాలంలో తెలంగాణ‌లోని బోలెడ‌న్ని కాలేజీల్లో యూత్ కి చేరువ‌గా వెళ్లి ఫ్యాన్ బేస్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అఖిల్ అంటే అంద‌నివాడు అనుకోకుండా అంద‌రికీ ద‌గ్గ‌ర‌గా ఉండేవాడు అన్న‌ట్టే అత‌డు ప్ర‌మోష‌న్స్ చేసుకున్నాడు. కేవ‌లం తెలంగాణ వ‌ర‌కే ప్ర‌మోష‌న్ చేస్తే ఎలా? అనుకున్నాడేమో.. నిన్న‌టి రేయి విశాఖ‌ప‌ట్నం వెళ్లి నేను ఆంధ్రా వాలానే అనే తీరుగా అక్క‌డ ప్లాటినం డిస్క్ వేడుక‌ను చేసుకున్నాడు. అత్యంత వైభ‌వంగా జ‌రిగిన ఈ వేడుక‌లో మెగా ప్రొడ్యూస‌ర్ బండ్ల గ‌ణేష్ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌ లో డిస్క‌ష‌న్ పాయింట్ అయ్యాయి. ఆ విషయం తెలిసిందే.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌ లో మనోడు ఈ ప్లాటినం డిస్క్‌ ఈవెంట్ చేశాక.. ఎనలేని క్రేజ్‌ పెరిగిందట. ముఖ్యంగా సింగిల్‌ స్ర్కీన్‌ లో బుకింగ్స్‌ కూడా ఓపెన్‌ అయిపోయాయ్‌. ఒక కొత్త హీరోకు ఈ రేంజు క్రేజ్‌ ఉండటం ఇదేనేమో. ఈ మధ్య కాలంలో అంత బిగ్గెస్ట్‌ డెబ్యూ అంటే టాలీవుడ్‌ లో అఖిల్‌ దే. ఆల్రెడీ టాప్‌ టైయర్‌ సిటీస్‌ లో మల్టీప్లెక్సుల్లో దాదాపు 3 రోజుల టిక్కెట్లు అయిపోయాయ్‌. అది అఖిల్‌ క్రేజ్‌.