Begin typing your search above and press return to search.
అఖిల్ తగ్గాడు.. ఇక బ్రూస్ లీకి మోతే..
By: Tupaki Desk | 15 Oct 2015 5:42 PM GMTథియేటర్ల నెంబర్లు, ఓపెనింగ్ డే రికార్డులు ఏవి ఎలా వున్నా పండగ సందర్భంగా విడుదలయ్యే పెద్ద సినిమాలన్నీ దాదాపు మంచి కలెక్షన్లే సాధిస్తాయి. సినిమా ఎలా వున్నా ఓ సారి లుక్కేయచ్చు అన్న భావన సగటు ప్రేక్షకుడిలో కలుగుతుంది. కాంపిటీషన్ వగైరా వ్యవహారాలు పక్కనబెడితే దొరికినంత దండుకునే సమయమిది. అందుకే బ్రూస్ లీ వస్తుందని తెలిసినా దసరా శెలవులను పురస్కరించుకుని రుద్రమదేవిని, 50కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అఖిల్ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సిద్ధపడ్డారు.
అయితే రుద్రమదేవి సినిమాకు పబ్లిసిటీ, మౌత్ టాక్ ఆశించిన రీతిలో రాకపోవడంతో ఇక పోటీ చరణ్ - అఖిల్ ల మధ్యే అనుకున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన అఖిల్ సినిమా వాయిదా పడినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో పండక్కి ఏకైక పెద్ద సినిమాగా బ్రూస్ లీ విడుదలకానుంది.
అయితే దసరా డేట్ ని వృధా చేయడం ఇష్టంలేక కళ్యాణ్ రామ్ షేర్ ఆ సమయంలో వచ్చే అవకాశాలు వున్నాయి. ఏది ఏమైనా అఖిల్ తగ్గడంతో బ్రూస్ లీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కాంపిటీషన్ తగ్గి మరిన్ని రికార్డులకు సహాయపడింది.