Begin typing your search above and press return to search.
రూ.62 కోట్లు.. అదీ అఖిల్ లెక్క
By: Tupaki Desk | 10 Nov 2015 7:30 AM GMTటాలీవుడ్లోనే కాదు.. మొత్తం సౌత్ ఇండియాలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు అఖిల్. హీరోగా అక్కినేని కుర్రాడి తొలి సినిమా నిర్మాత నితిన్ కు ఏకంగా రూ.62 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టడం విశేషం. థియేట్రికల్ బిజినెస్ తో పాటు శాటిలైట్ రైట్స్, ఇతర హక్కులన్నీ కలిపితే రూ.62 కోట్లుగా తేలింది. టాలీవుడ్ వరకే కాదు, సౌత్ ఇండియా మొత్తంలో ఓ డెబ్యూ హీరోకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ఓ రికార్డు.
నైజాం ఏరియాకు రూ.13 కోట్లకు హక్కులు అమ్ముడవడం విశేషం. నైజాంలో బడా బడా సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే ఫిగర్ ఇది. సీడెడ్ కు రూ.6.7 కోట్లకు, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపు రూ.18 కోట్లకు బిజినెస్ జరిగింది. కర్ణాటక హక్కులు రూ.4 కోట్లకు అమ్ముడవడం విశేషం. ఓవర్సీస్ రైట్స్ కూడా అదే స్థాయిలో పలికాయి. తమిళం, మలయాళం, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.3 కోట్లకు హక్కులు అమ్మారు. మొత్తంగా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ వాల్యూ రూ.48 కోట్లు దాటిపోయాయి.
శాటిలైట్ రైట్స్ - ఆడియో - లైవ్ - ఇతర హక్కులు కలిపి ఇంకో రూ.14 కోట్ల దాకా తేలింది లెక్క. మొత్తం అన్నీ కలిపితే రిలీజ్ కు ముందే రూ.62 కోట్ల ఆదాయం సమకూరింది. ఐతే సినిమా మీద నితిన్ ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత లాభం పొందాడు అన్న లెక్కలు తెలియట్లేదు. లాభమైతే గ్యారెంటీ.. డౌట్ లేదు. ఐతే ఓ కొత్త హీరో మీద ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టిన బయ్యర్లే కొంచెం కంగారుగా ఉన్నాడు. తొలి సినిమాతోనే రూ.50 కోట్ల దాకా షేర్ రాబట్టడమంటే అఖిల్ కు అది మామూలు సవాల్ కాదు.