Begin typing your search above and press return to search.
అఖిల్ సినిమా వాయిదా నిజమా?
By: Tupaki Desk | 8 Oct 2015 11:30 AM GMTఅక్కినేని హీరో అఖిల్ సినిమాపైనే ప్రపంచం కళ్లన్నీ. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న ఎగ్జయిట్ మెంట్ అక్కినేని అభిమానులు సహా కామన్ జనాల్లోనూ ఉంది. అందుకు తగ్గట్టే ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 21న రిలీజవుతుందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ఈ సినిమా రిలీజ్ విషయమై ఓ నెగెటివ్ టాక్ ఫిలింనగర్ లో వినిపిస్తోంది.
అఖిల్ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది. అఖిల్ దర్శకనిర్మాతలు వేచి చూసే ధోరణి తో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం... అఖిల్ సినిమా 22న రిలీజ్ చేయాలనుకున్నా .. కాస్త వేచి చూసే ధోరణిలో ఉన్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ బ్రూస్ లీ రిలీజై ఫలితం ఎలా ఉంటుందో చూసిన తర్వాతే రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారట. ఒకవేళ బ్రూస్ లీ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తే అనుకున్న ప్రకారమే రిలీజ్ చేస్తారు. అలా కాని పక్షంలో వేచి చూసి సరైన రిలీజ్ తేదీని నిర్ణయిస్తారని చెప్పుకుంటున్నారు. బ్రూస్ లీ వల్ల కలెక్షన్ల పరంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశాన్ని కొట్టి పారేయలేమని సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానించడం విశేషం.
అయితే ఇదే విషయాన్ని సినిమా టీమ్ దగ్గర ప్రస్తావిస్తే... అసలు పోస్టుపోన్ చేసే ఛాన్సు లేదని చెప్పేశారు. ఎందుకంటే సినిమా రిలీజ్ కరెక్టుగా ఇంకా నాలుగు రోజులు సెలవలు ఉన్నాయనగా కుదిరిందట. ఇలాంటి పండుగ టైమ్ ను మిస్ చేసుకోలేం అంటున్నారు. పైగా బ్రూస్ లీ.. రుద్రమదేవి.. ఆల్రెడీ ధియేటర్ల ఎగ్రిమెంట్లు చేసుకున్నా కూడా.. అఖిల్ కోసం కూడా ఆల్రెడీ చాలా ఎగ్రిమెంట్లు చేసేశారట. సో.. రిలీజ్ కు ధియేటర్ల ప్రాబ్లం కాని.. ఒకవేళ రుద్రమదేవి.. బ్రూస్ లీ.. బ్లాక్ బస్టర్లు అయినందున అఖిల్ కు వచ్చే కలెక్షన్ల ప్రాబ్లం ఏమీ ఉండబోదని సన్నిహిత వర్గాలు తుపాకి.కాం తో సెలవిచ్చాయి.