Begin typing your search above and press return to search.
నితిన్...ఇదే మాట కాస్త ముందు చెప్పుంటే!
By: Tupaki Desk | 16 Oct 2015 3:58 AM GMTతాను నిర్మించిన అఖిల్ సినిమాని వాయిదా వేస్తున్నట్టు నితిన్ ముందే చెప్పుంటే? రామ్ చరణ్ బ్రూస్ లీ మరో వారం ఆలస్యంగా వచ్చుండేవాడా? ఇప్పుడు నితిన్ తీసుకొన్న నిర్ణయం వల్ల బ్రూస్ లీకి మేలవుతుందా లేక రుద్రమదేవికి మేలవుతుందా? గుణశేఖర్ అఖిల్ సినిమా విషయంలో భాదపడుతున్నాడా?
పెద్ద సినిమాల మధ్య కనీసం రెండు వారాల గ్యాపయినా ఉండాలనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. అది నిజంగా అవసరం కూడా. కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాలు వారం రోజుల్లోనే వసూళ్లు రాబట్టుకోవాలంటే అయ్యే పని కాదు. అందుకే నిర్మాతలు ఒకరికొకరు మాట్లాడుకొని సినిమాకీ సినిమాకీ మధ్య రెండు వారాల గ్యాప్ వచ్చేలా చూసుకొంటుంటారు. ఆగడు - బాహుబలి విషయాల్లో అదే జరిగింది. ఆగడు తర్వాత వెంటనే రావాల్సిన గోవిందుడు అందరివాడేలేని కొన్నాళ్లపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. బాహుబలి కోసమని శ్రీమంతుడుని కూడా ఆలస్యంగా విడుదల చేశారు. అయితే రుద్రమదేవి విషయంలో మాత్రం ఆ సహకారం కనిపించలేదు. ఆ సినిమా విడుదలైన వారం రోజులకే బ్రూస్ లీ విడుదలైంది. దర్శకనిర్మాత గుణశేఖర్ తన రుద్రమదేవి కోసం ఎలాగైనా బ్రూస్ లీని ఒక వారం పాటు వాయిదా వేయించాలని శతవిధాలా ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు.
అందుకు కారణమేమిటంటే అఖిల్ అక్కినేని సినిమా 22న విడుదల చేయాలని ఫిక్సయిపోవడమే. ఒకవేళ అఖిల్ సినిమా వాయిదా వేసుంటే చరణ్ కూడా ఆలోచించేవాడేమో. ఇంటర్వ్యూల్లో కూడా అదే విషయాన్ని ఇండైరెక్టుగా చెప్పాడు. బాహుబలి సమయంలో ఒకరికొరు మాట్లాడుకొని సినిమాలన్నీ వాయిదా వేసుకొన్నారని, ఆ ప్లానింగ్ ఇప్పుడు లేదు కదా అని చరణ్ చెప్పిన విషయం తెలిసిందే.
కానీ నితిన్ మాత్రం బూస్ లీ విడుదలకు ఒక్క రోజు ముందు అంటే గురువారం రాత్రి తన సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అఖిల్ సినిమా అనుకొన్న సమయానికే వస్తుందని అంతా ఫిక్సయిపోయారు. కానీ ఇప్పుడు గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమవుతోందంటూ సినిమాని వాయిదా వేశారు. ఒక పెద్ద సినిమా విడుదల కాకపోతే ఆడుతున్న ఇతర సినిమాలకి కచ్చితంగా ప్లస్సే అవుతుంది. అయితే అఖిల్ వాయిదా ఇప్పుడు థియేటర్లలో ఉన్న బ్రూస్ లీకి మేలు చేస్తుందా లేక రుద్రమదేవికి మేలు చేస్తుందా? అనేది చూడాలి. రామ్ చరణ్ - చిరంజీవిలాంటి క్రౌడ్ పుల్లింగ్ హీరోలు నటించిన సినిమా కాబట్టి బ్రూస్ లీకే ప్లస్సవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గుణశేఖర్ కి మాత్రం గుడ్డిలో మెల్ల అన్నట్టుగా మారింది.