Begin typing your search above and press return to search.
అఖిల్ కి వంశీ స్టోరీ అదిరిందటగా
By: Tupaki Desk | 12 March 2016 6:05 AM GMTఅక్కినేని అఖిల్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ దాదాపుగా ఖాయమైపోయింది. నాగ్-కార్తీల మల్టీస్టారర్ ఊపిరి విడుదల అయిన వెంటనే ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు నాగార్జున సిద్ధమవుతున్నారు. ఊపిరి కోసం దాదాపు రెండేళ్ల పాటు వంశీ పైడిపల్లితో కలిసి పని చేసిన నాగ్.. ఈ డైరెక్టర్ పై పూర్తి విశ్వాసం ఉంచుతున్నాడు.
ఊపిరి షూటింగ్ టైంలోనే అఖిల్ కోసం ఓ స్క్రిప్ట్ చేయాలని వంశీకి నాగ్ సూచించారట. ఒకవైపు ఆ సినిమాని చూసుకుంటూనే మరోవైపు అఖిల్ కి సరిపోయే స్టోరీపై పని చేసిన వంశీ.. ఓ యంగ్ జనరేషన్ యూత్ ఫుల్ స్టోరీని నాగ్ కి వినిపించాడని అంటున్నారు. ఈ లైన్ వినగానే నాగ్ కు విపరీతంగా నచ్చేసి, అఖిల్ సెకండ్ మూవీ ఛాన్స్ ఈ డైరెక్టర్ కే అప్పచెప్పాలని డిసైడ్ అయిపోయారట. అందుకే అఖిల్ సెకండ్ మూవీ విషయంలో ఏ మాత్రం టెన్షన్ పడకుండా నాగ్ నిశ్చింతగా ఉన్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల చివర్లో ప్రాజెక్ట్ సంగతులు ప్రకటించి.. ఏప్రిల్ లోనే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అఖిల్ సరసన హీరోయిన్ సహా.. ఇతర క్యాస్టింగ్ కార్యక్రమాలపై కూడా వర్క్ చేసేస్తున్నారు