Begin typing your search above and press return to search.

మజ్ను డేట్ ఫిక్స్ అయిందోచ్

By:  Tupaki Desk   |   13 Dec 2018 10:30 AM IST
మజ్ను డేట్ ఫిక్స్ అయిందోచ్
X
అక్కినేని అఖిల్ - దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో 'Mr. మజ్ను' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ జనవరిలో అని ఒకసారి.. ఫిబ్రవరిలో అని మరోసారి రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయం పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు నిర్మాతలు. జనవరి 25 న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఈ సినిమాకు రిపబ్లిక్ డే.. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ దక్కనుంది.

గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో 'Mr. మజ్ను' విజయంపై అఖిల్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. 'తొలి ప్రేమ' లాంటి సినిమాను వరుణ్ తేజ్ కు అందించిన వెంకీ అట్లూరి తనకు కూడా మంచి బ్రేక్ ఇస్తాడని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ ఒక మోడరన్ రోమియో అవతారంలో కనిపిస్తాడు. లవ్ స్టొరీలలో నటించిన ప్రతిసారి అక్కినేని ఫ్యామిలీ హీరోలకు మంచి ఆదరణ దక్కుతుంది. మరి చినబాబుకు అక్కినేని పాజిటివ్ సెంటిమెంట్ కలిసివస్తుందేమో వేచి చూడాలి.

కథ ప్రకారం ఈ సినిమా మెజారిటీ షూటింగ్ లండన్ లో లో జరిగింది. 'సవ్యసాచి' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. జార్జ్ సి.విలియమ్స్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్. BVSN ప్రసాద్ ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్నారు.