Begin typing your search above and press return to search.

నాన్న ఎప్పుడు మమ్ముల్ని కంట్రోల్‌ చేయరు

By:  Tupaki Desk   |   31 Jan 2019 6:36 AM GMT
నాన్న ఎప్పుడు మమ్ముల్ని కంట్రోల్‌ చేయరు
X
నాగచైతన్య, అఖిల్‌ ల ప్రతి సినిమా విషయంలో కూడా నాగార్జున ఇన్వాల్వ్‌ మెంట్‌ ఉంటుందని, సినిమా కథ ఓకే అయిప్పటి నుండి ఫైనల్‌ కాపీ వచ్చేప్పటి వరకు నాగార్జున సలహా మేరకే సినిమా తెరకెక్కుతుందనేది ఇండస్ట్రీలో మరియు బయట ఉన్న టాక్‌ ఆ విషయమై అఖిల్‌ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. నాన్న మా సినిమాల విషయంలో సలహాలు అయితే ఇస్తారు, కాని ఆయన ఎప్పుడు కూడా మా విషయంలో కంట్రోల్‌ చేయాలని చూడలేదు - అలా చూడరు కూడా అంటూ చెప్పుకొచ్చాడు. ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు వెళ్లే విధంగా అన్నయ్య చైతూకు నాకు ఫ్రీడం ఇచ్చారు.

తాజాగా 'మిస్టర్‌ మజ్ను' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్‌ ఆ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం విజయోత్సవ యాత్రలో ఉన్న అఖిల్‌ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ఒక ఇంటర్వ్యూలో ర్యాఫిడ్‌ ఫైర్‌ ప్రశ్నలకు ఆశ్చర్యకరంగా సమాధానాలు చెప్పి అందరిని ఆశ్చర్య పర్చాడు. ఇండస్ట్రీలోని యంగ్‌ హీరోలతో తనకున్న అనుబంధాన్ని చెప్పకనే చెప్పాడు.

ఇండస్ట్రీలో స్మార్ట్‌ ఎవరంటే 'తారక్‌' అంటూ సమాధానం ఇచ్చిన అఖిల్‌ తన అన్న నాగచైతన్య చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక రానాను కన్నింగ్‌ అంటూ తేల్చి పారేశాడు. ఇండస్ట్రీలో మాస్‌ హీరో అంటే చిరంజీవి గారు మాత్రమే అని, ఇక డాన్స్‌ పరంగా రామ్‌ చరణ్‌ ది బెస్ట్‌ అంటూ చెప్పుకొచ్చాడు. హ్యాండ్సమ్‌ హీరో అంటే మహేష్‌ బాబు పేరు తప్ప మరే పేరు చెప్పలేనంటూ అఖిల్‌ సరదాగా సమాధానాలు ఇచ్చాడు. మిస్టర్‌ మజ్ను కూడా ఫ్లాప్స్‌ జాబితాలోకి చేరిపోయిందని ట్రేడ్‌ వర్గాల వారు విశ్లేషిస్తున్నా - ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించి, కలెక్షన్స్‌ ను రాబట్టేందుకు ప్రమోషన్స్‌ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు.