Begin typing your search above and press return to search.

అఖిల్!! క్లారిటీ ఎప్పుడు ఇస్తావ్?

By:  Tupaki Desk   |   20 Jan 2018 8:20 PM GMT
అఖిల్!! క్లారిటీ ఎప్పుడు ఇస్తావ్?
X
స్టార్ హీరో కొడుకుకి మొదటి హిట్ అందేవరకు ఆ హీరో పడే టెన్షన్స్ అన్ని ఇన్ని కావు. కనీసం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. నాగార్జున కూడా అఖిల్ కోసం ఇదే తరహాలో ఆలోచిస్తున్నాడు. అఖిల్ మొదటి సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్స్ లోను సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత సినిమా మొదట పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా అది కూడా ప్లాప్  గా నిలించింది.

మరి ఇప్పుడు మూడవసారి నాగార్జున ఏం ప్రయత్నం చేస్తాడు అనేది హాట్ టాపిక్ అయ్యింది. హలో ప్రమోషన్స్ లో అయితే నెక్స్ట్ సినిమా అఖిల్ వెతుక్కోవాలాని చెప్పిన సంగతి తెలిసిందే. కాని అఖిల్ కి ఇంకా సరైన క్లారిటీ రావడం లేదు. జనవరి 10న రెండు కథలు విని ఎదో ఒక కథను ఫైనల్ చేస్తాను అని న్యూ ఇయర్ సందర్బంగా తెలిపాడు. కానీ ఆ డేట్ అయిపోవడమే కాకుండా సంక్రాంతి కూడా ఫినిష్ అయ్యింది. కానీ అఖిల్ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

అఖిల్ ఆలోచన ప్రకారం ప్రస్తుతం కొత్త దర్శకుడితో తన సొంత నిర్ణయంతో హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడట. కానీ నాగార్జున మాత్రం కలెక్షన్స్ పరంగా అలాగే టాక్ పరంగా పర్ఫెక్ట్ హిట్టు అందుకోవాలని పెద్ద దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ ఇద్దరు దర్శకులు నాగ్ ని కథలతో మెప్పించినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.