Begin typing your search above and press return to search.
నాగార్జున కొడుక్కి ‘శివ’ నచ్చలేదట
By: Tupaki Desk | 10 Dec 2017 7:34 AM GMTశివ.. తెలుగు సినిమాను మలుపు తిప్పిన క్లాసిక్. తెలుగు సినిమాను ‘శివ’కు ముందు.. ‘శివ’కు తర్వాత అని విభజించి చెప్పుకునేంతగా ప్రభావం చూపించిన చిత్రమది. ఆ సినిమా సాధించిన విజయం గురించి.. దాని ప్రభావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కినేని నాగార్జున కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిందా సినిమా. అలాంటి సినిమా ఆయన తనయుడు అఖిల్ కు చాలా కాలం పాటు నచ్చలేదట. తొలిసారి చూసినపుడు ఆ సినిమా అసలు అర్థమే కాలేదట నాగ్ చిన్న కొడుక్కి.
‘‘అవును.. శివ సినిమా తొలిసారి చూసినపుడు నాకు నచ్చలేదు. అర్థం కూడా కాలేదు. ఐతే ఆ సినిమా మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నా. ఇప్పటిదాకా 22 సార్లు ఆ సినిమా చూశాను. నాకు 16వ సారి చూసినపుడు కానీ అది నచ్చలేదు. బహుశా అప్పుడు నాకు ఆ సినిమాను అర్థం చేసుకునే వయసు వచ్చిందనుకుంటా’’ అని అఖిల్ చెప్పాడు.
ఇక తనకు సినిమాల వైపు మనసు మళ్లడం గురించి అఖిల్ చెబుతూ.. ‘‘ఇంటర్ చదువుకుంటున్నపుడు నాన్నతో యాక్టింగ్ కోర్సు చేయాలనుందని చెప్పాను. ఆయనేమీ అనలేదు. ఎందుకంటే నా మనసులో ఏముందో ఆయనకు తెలుసు. నా నోటి నుంచి ఆ మాట వినాలని ఎదురు చూశారు. చిన్నప్పట్నుంచి సినిమా వాతావరణంలో పెరిగాను. సినిమాల గురించే ఎక్కువ ఆలోచించేవాడిని. కాబట్టి సినిమాల్లోకే వచ్చాను’’ అని అన్నాడు.