Begin typing your search above and press return to search.

సమంత ఆలోచనలు వైల్డ్ అంటున్న మరిది

By:  Tupaki Desk   |   28 Dec 2017 3:50 PM IST
సమంత ఆలోచనలు వైల్డ్ అంటున్న మరిది
X
తన వదిన సమంత చాలా స్పెషల్ అంటున్నాడు అఖిల్ అక్కినేని. ఆమె ఆలోచనలు కానీ.. కామెంట్స్ కానీ చాలా వైల్డ్ గా ఉంటాయని అతను వ్యాఖ్యానించడం విశేషం. ‘హలో’ సినిమాలో తన పాత్ర.. నటన గురించి సమంత ప్రి రిలీజ్ ఈవెంట్లలో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ అతనీ వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో నిజమైన అఖిల్ ను చూపించినందుకు దర్శకుడు అఖిల్ కుమార్ కు థ్యాంక్స్ అని సమంత అన్న సంగతి తెలిసిందే. దానిపై స్పందిస్తూ అఖిల్ ఇలా అన్నాడు. ‘హలో’ విడుదల తర్వాత తాను తన వదినను కలవలేదని.. ఆమె ముంబయి - చెన్నైల్లో బిజీగా తిరుగుతోందని.. ఐతే న్యూ ఇయర్ వేడుకల్ని మాత్రం తన వదినతోనే చేసుకోబోతున్నానని అఖిల్ చెప్పాడు. సమంతే తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పార్టనర్ అన్న అఖిల్.. ఆమె తన కోసం ఏం ప్లాన్ చేసిందో తెలియదని అన్నాడు.

ఇక ‘హలో’ సినిమా విషయంలో చిరంజీవి.. చరణ్ చూపించిన ప్రేమ అసాధారణమని.. వాళ్లు తన మీద మరీ ఎక్కువ ప్రేమ చూపించేశారని అఖిల్ అన్నాడు. ‘హలో’ సినిమా భాషలో చెప్పాలంటే చిరు తనకు ‘ఐ హేట్ యూ’ చెప్పాడని అఖిల్ అన్నాడు. చిరంజీవిని తాను పెదనాన్న అని ఊరికే అనేయలేదని.. ఆయన.. ఆయన కుటుంబం తన మీద ఎప్పుడూ అంత ప్రేమ చూపిస్తోందని అఖిల్ అన్నాడు. ‘హలో’ సినిమా విడుదలకు ముందు రోజంతా నిద్రే పోలేదన్న అఖిల్.. తెల్లవారుజామున యుఎస్ నుంచి ఫోన్ చేసి సినిమా బాగుందని ఆడియన్స్ చెప్పాక ప్రశాంతంగా పడుకున్నానని అతనన్నాడు. ‘హలో’కు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటని అడిగితే.. ఒకమ్మాయి ఈ చిత్ర క్లైమాక్స్ గురించి గొప్పగా చెప్పిందని.. ఆమె మనసు దోచేశానని అందని.. అదే తనకు బెస్ట్ కాంప్లిమెంట్ అని అన్నాడు.