Begin typing your search above and press return to search.
ఎప్పుడూ అవేనా అఖిల్ బాబూ?
By: Tupaki Desk | 1 July 2015 1:30 PM GMTటాలీవుడ్‌లో మరో స్టార్ ఫ్యామిలీ వారసుడి అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ ఈ ఏడాదే తెలుగు తెరపైకి దూసుకొస్తున్నాడు. పెద్ద కొడుకు నాగచైతన్యను కొంచెం క్లాస్‌గా ఉండే మూవీతో అరంగేట్రం చేయించడం వల్ల జరిగిన నష్టమేంటో బాగా అర్థం చేసుకున్న నాగార్జున.. చిన్న కొడుకును మాత్రం పక్కా మాస్ సినిమాతో లాంచ్ చేస్తున్నాడు. మాస్ హీరోల్ని అద్భుతంగా ప్రెజెంట్ చేయగల వి.వి.వినాయక్‌కు కొడుకును లాంచ్ చేసే బాధ్యత అప్పగించాడు.
హీరోల ఫ్యామిలీ నుంచి రాకపోయినా బెల్లంకొండ శ్రీనివాస్‌ను 'అల్లుడు శీను' సినిమాతో వినాయక్ మాస్ హీరోగా ఎలా ప్రెజెంట్ చేశాడో అందరికీ తెలిసిందే. అలాంటిది అక్కినేని ఫ్యామిలీ హీరో అంటే ఇక ఎలా చెలరేగిపోతాడో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ అఖిల్‌కు ఇప్పటికే స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చేసింది.
ఐతే అఖిల్‌ను మాస్ హీరోగా ప్రెజెంట్ చేయాలనుకోవడం బాగానే ఉంది కానీ.. ఆ విషయంలో మరీ శ్రుతి మించుతున్నారేమో అని డౌట్ వస్తోంది. ఇప్పటిదాకా సినిమాకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలన్నీ యాక్షన్ దృశ్యాలకు సంబంధించినవే. హైదరాబాద్‌లో మొదలుపెట్టడమే ఫైట్ సీన్స్‌తో మొదలుపెట్టారు. ఆ తర్వాత స్పెయిన్‌కు వెళ్లి అక్కడా యాక్షన్ సీన్సే చేశారు. ఇప్పుడు థాయిలాండ్‌కు వెళ్లి అక్కడ కూడా ఫైట్ సన్నివేశాలే తీస్తున్నారట. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. అయినా ఎప్పుడూ చూసినా అఖిల్‌తో ఫైటింగులే చేయించడమేంటో. జాకీచాన్, జెట్‌లీ టైపు ఫైటింగుల సినిమానా అని డౌటొస్తోంది. ఈ రోజుల్లో ఊరికే ఫైటింగులతో నింపేస్తే జనాలు చూసే పరిస్థితి లేదు. ఎంత యాక్షన్ సినిమా అయినా.. రెండు మూడు ఫైట్లంటే ఓకే.. ఎంటర్టైన్మెంటే అన్నింటికంటే ముఖ్యం. వినాయక్‌కు ఆ సంగతి తెలియందేమీ కాదు. మరి అతనేం చేస్తాడో చూడాలి.