Begin typing your search above and press return to search.

చెప్పడానికి నాకు స్వేచ్ఛ లేదు -అఖిల్

By:  Tupaki Desk   |   5 May 2016 9:30 AM GMT
చెప్పడానికి నాకు స్వేచ్ఛ లేదు -అఖిల్
X
అక్కినేని వంశానికి నవతరం వారసుడు అఖిల్ అరంగేట్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్ మూవీ.. చివరకూ ఘోరమైన రిజల్ట్ ఇచ్చింది. దీంతో నెక్ట్స్ ప్రాజెక్టు పై చాలానే కేర్ తీసుకున్న నాగార్జున అండ్ కో.. ఇప్పుడు తుది నిర్ణయానికి వచ్చేశారు. ఈ విషయాన్ని అఖిల్ కూడా చెప్పేశాడు. తన సెకండ్ మూవీ త్వరలో స్టార్ట్ అవుతుందన్నాడు అఖిల్.

'నాకు ఇది లాంగ్ బ్రేక్. అఖిల్ తర్వాత చాలానే ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఏదైనా కొత్తగా ఆసక్తి కలిగేలా ఉండాలని భావించాను. ఇప్పుడు రెండో సినిమా ప్రారంభానికి సిద్ధమవుతున్నాను. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిపోగా.. సమ్మర్ తర్వాత స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. జూన్ లో నా సెకండ్ మూవీని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం' అన్న అఖిల్.. డైరెక్టర్ - హీరోయిన్ ఎవరో చెప్పమంటే మాత్రం అబ్బెబ్బే అంటున్నాడు.

'ఇంతకంటే వివరాలు చెప్పడానికి నాకు స్వేచ్ఛ లేదు. కానీ ఇదో అర్బన్ లవ్ స్టోరీ - బోలెడంత ఎంటర్టెయిన్మెంట్ ఉంటుంది' అంటూ పజిల్ కంటిన్యూ చేశాడు అఖిల్. అలాగే తన మొదటి సినిమా ఫెయిల్ అవ్వడానికి నాన్న నాగ్ చెప్పిన ఓ కామెంట్ బాగా గుర్తుండిపోయిందన్నాడు అఖిల్. ప్రపంచాన్ని కాపాడేసే వయసు నీకింకా రాలేదంటూ అప్పట్లో నాగ్ చేసిన కామెంట్ ఆలోచింపచేసిందన్నాడు అఖిల్.