Begin typing your search above and press return to search.
అఖిల్ ను ఇరకాటంలో పడేశారే!!
By: Tupaki Desk | 28 May 2016 4:55 AM GMTచిన్నపిల్లాడిని చేసి యంగస్టర్ అఖిల్ ను ఆడుకుంటున్నారా అంటే.. మనం ఖచ్చితంగా అవుననే చెప్పుకోవాలేమో. సరిగ్గా ఓ 20 రోజుల క్రితం.. మనోడు వంశీ పైడిపల్లితో తాను చేస్తున్న సినిమా గురించి.. చాలా క్లారిటీనే ఇచ్చాడు. అవన్నీ అందరూ డైజస్ట్ చేసుకునేలోపే.. అసలు ఇక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది.
అప్పట్లో అఖిల్ ఏమన్నాడంటే.. నేను వంశీ పైడిపల్లితోనే నా తదుపరి సినిమా చేస్తున్నాను. మేం కలిసే పనిచేస్తున్నాం. మాంచి సబ్జెక్ట్ ఇంకా దొరకలేదు.. అని చెప్పుకొచ్చాడు. బాగానే ఉంది. ఆ తరువాత తమను ఆదుకోవాలని ''బ్రహ్మోత్సవం'' పంపిణీదారులు నిర్మాత పివిపి ని కలిసినప్పుడు.. మనం త్వరలోనే వంశీ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాం.. దాని డిస్ర్టిబ్యూషన్ మీకే అంటూ ఆయన చెప్పాడట. అప్పటికే వంశీ కూడా బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్ లో గెస్టుగా రావడం.. పైగా చాలా రూమర్లు వినిపించడం.. వెరసి ఈ వంశీ-మహేష్ కాంబో కరక్టే అనే అనిపిస్తున్నాయి. అంటే.. అప్పట్లో బల్లగుద్ది చెప్పిన అఖిల్ పరిస్థితి ఏంటిప్పుడు?
అందుకే అఖిల్ కూడా.. మహేష్-వంశీ ప్రాజెక్టుపై ఎన్ని రూమర్లు లేదా వార్తలు వస్తున్నా కూడా.. సైలెంట్ గానే ఉండిపోయాడు. అలా సైలెంట్ గా ఉండమని కింగ్ నాగార్జున సలహా ఇచ్చారట. ఏంటో.. పిల్లాడ్ని ఇలా ఇరకాటంలో పడేశారు.