Begin typing your search above and press return to search.
అసలైన వారసుడిలా కనిపిస్తున్నాడే
By: Tupaki Desk | 5 Oct 2015 5:32 AM GMTసినిమాని చాలామంది బిజినెస్ లా ఫీలవుతున్నారు. కానీ నాకు అది ఓ ఆర్ట్ ఫాం లాంటిది. కుంచెతో గీసిన పెయింటింగ్ లాంటిదని అంటున్నాడు అక్కినేని అఖిల్. రెండున్నర గంటల పాటు తెర కోసం క్రియేట్ చేసిన ఓ ఆర్ట్ అని నేను భావిస్తాను. జనాలకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. బావుంటే బావుందని పొగిడేయొచ్చు. బాగోకపోతే బాలేదని విమర్శించవచ్చు. డబ్బు పెట్టామా? తిరిగి వచ్చిందా? సంపాదించుకున్నామా? అన్నట్టు సినిమాని చూస్తామంటే కుదరదు. ఒక్కోసారి పెట్టింది తిరిగి రాకపోవచ్చు. నో రిటర్న్ బిజినెస్ ఇది.
ఫ్యాక్టరీలో తయారైన కోక్ బాటిళ్లలో కోక్ అంతే ఒకే రుచిని కలిగి ఉంటుంది. కానీ సినిమా అలా కాదు. విభిన్నమైన అభిరుచుల సమ్మేళనం. సినిమాల విషయానికి వస్తే ప్రతి సినిమా దేనికదే కొత్త దనాన్ని కలిగి ఉండాల్సిందే. ఇది కోక్ లా కాదు. ఇందులో పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయి అన్న గ్యారెంటీ లేనేలేదు.. సక్సెస్ వస్తుందని అనుకోవడానికి లేదిక్కడ.. అంటూ కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడాడు. అక్కినేని వంశం బిజినెస్ మైండెడ్. తాత అక్కినేని నాగేశ్వరరావు ఆ రోజుల్లోనే దూరదృష్టితో అన్నపూర్ణ స్టూడియోస్ ని ప్రారంభించారు. అందులోనే ఫిలిం ల్యాబులు ఏర్పాటు చేశారు. ఆ పేరుతోనే బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత నటవారసత్వాన్ని కొనసాగిస్తూనే నాగార్జున వ్యాపారవేత్తగా బోలెడన్ని విజయాలు సాధించారు. రెస్టారెంట్ బిజినెస్ - సినిమాల నిర్మాణం - పబ్బులు వంటి బిజినెస్ లతో ఆయన ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నారు. ఇప్పుడు అఖిల్ కూడా అంతే క్లారిటీతో ఉన్నాడు.
తాత - తండ్రి వారసత్వాన్ని - లెగసీని సినిమాల్లోనూ - వ్యాపారంలోనూ కొనసాగించేందుకు అవసరమైన పరిణతి అతడిలో కనిపిస్తోంది. అసలు సిసలైన వారసుడిలా కనిపిస్తున్నాడు.