Begin typing your search above and press return to search.

అఖిల్‌ ఫోన్‌ వాల్‌ పేపర్‌ 10 ఏళ్లుగా అదే..!

By:  Tupaki Desk   |   13 Oct 2021 7:30 AM GMT
అఖిల్‌ ఫోన్‌ వాల్‌ పేపర్‌ 10 ఏళ్లుగా అదే..!
X
కొన్ని జ్ఞాపకాలను ఎప్పటికి గుర్తుంచుకోవాలనుకుంటాం.. కొన్ని జ్ఞాపకాలను మాత్రం గుర్తుంచుకోవాలనుకున్నా మర్చిపోతాం. జ్ఞాపకాల్లో నిలిచే వ్యక్తులు కొద్ది మందే ఉంటారు. ఎప్పటికి మనసులో ఉండే వ్యక్తులు కొద్ది మంది ఉంటారు. అలా అక్కినేని అఖిల్‌ మనసులో ఉండే వ్యక్తి తాత ఏయన్నార్‌. లెజెండ్రీ ఏయన్నార్ అంటే సాదారణ సినీ ప్రేమికుల్లోనే అమితమైన భక్తి.. ఆరాధన.. అభిమానం ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆయన ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాత్రలను చేశాడు.. ఆయన చేసిన పాత్రలు ఇప్పటికి కూడా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. అంతటి అద్బుతమైన పాత్రల్లో కనిపించిన ఏయన్నార్‌ కొన్ని లుక్స్ లో ఎవర్ గ్రీన్‌ గా అనిపిస్తూ ఉంటాడు. నెట్‌ లో ఆయన పేరు సెర్చ్‌ కొడితే కొన్ని ట్రెండ్‌ మార్క్ ఫొటోలు ఫోజ్ లు వస్తాయి. అలాంటి ఫొటోలు రాబోయే తరాలకు కూడా ఏయన్నార్‌ ను అభిమాన స్టార్‌ గా నిలుపుతాయి అనడంలో సందేహం లేదు. ఏయన్నార్‌ చనిపోయినా కూడా ఆయన గుర్తులు నెమరవేసుకుంటూనే ఉంటారు. అఖిల్‌ తన తాతను ప్రతి రోజు గుర్తు చేసుకుంటూ ఆయన జ్ఞాపకాల్లో ఉంటాడట.

ఈ విషయాన్ని స్వయంగా ఆయన వెళ్లడించాడు. అఖిల్‌ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ లో మీడియాతో మాట్లాడుతూ అఖిల్‌ ఒక ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేసుకున్నాడు. గత పది సంవత్సరాలుగా తాను ఫోన్ లు మార్చుతూ వచ్చినా కూడా తన ఫోన్‌ వాల్‌ పేపర్‌ మాత్రం మార్చలేదు అన్నాడు. తన తాత ఏయన్నార్‌ ఫొటోను ఫోన్‌ స్క్రీన్‌ సేవర్ గా పెట్టుకున్నాడు. అది కూడా ఒకే ఫొటోను ఇన్ని సంవత్సరాలుగా తన స్క్రీన్‌ సేవర్‌ గా పెట్టుకుంటూ వస్తున్నాడట. బ్లాక్ అండ్ వైట్‌ లో ఉండే ఆ ఫొటో లో ఏయన్నార్‌ చాలా కూల్‌ గా లైట్‌ స్మైల్ తో కోర్టు వేసుకుని ఉంటారు. చెస్ట్‌ వరకు మాత్రమే ఆ ఫొటోలో కనిపిస్తూ ఉంటాడు.

ఆ ఫొటో గురించి అఖిల్‌ మాట్లాడుతూ ఇది తాత నటించిన ఏ సినిమాలో స్టిల్‌ కాదు. ఒక సారి ఆడిషన్స్ కోసం మేకప్‌ టెస్ట్‌ చేయాల్సి ఉండగా తీసిన ఫొటో ఇది. ఎందుకో నాకు ఫొటో చాలా నచ్చింది. అప్పటి నుండి కూడా నా వద్ద ఈ ఫొటో ఉంది. ఫోన్ వాడుతున్నప్పటి నుండి కూడా నా ఫోన్ కు ఈ ఫొటోను వాల్‌ పోస్టర్ గా వాడుతున్నట్లుగా అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక అఖిల్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ తో మొదటి కమర్షియల్‌ అందుకుంటాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక విభిన్నమైన కమర్షియల్‌ పాయింట్‌ తో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు అక్కినేని ఫ్యాన్స్ భారీగానే పెంచుకున్నారు.

అఖిల్‌ గత మూడు సినిమా ల తరహాలో కాకుండా ఈ సినిమా కమర్షియల్‌ గా బిగ్ సక్సెస్ ను చవి చూడాలని అంతా ఆశిస్తున్నారు. దసరా కానుకగా రాబోతున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే. గీతా ఆర్ట్స్ లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించాడు. అఖిల్‌ లుక్ తో పాటు పలు విషయాల్లో ఈ సినిమా ప్రేక్షకుల అటెన్షన్‌ ను దక్కించుకుంది. ఈ సినిమా మొదట అనుకున్న కథ కాకుండా సెకండ్‌ హాఫ్ మరియు క్లైమాక్స్ ను మంచి పాయింట్‌ తీసుకుని తెరకెక్కించినట్లుగా నిర్మాత బన్నీ వాసు అంటున్నాడు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో పాటు హీరో అఖిల్‌ కు కూడా ఈ సినిమాపై చాలా ఆశలు ఉన్నాయి.