Begin typing your search above and press return to search.

ఆయనతో అఖిల్‌ ఫిలిం.. డౌటే!!

By:  Tupaki Desk   |   19 Dec 2015 5:02 AM GMT
ఆయనతో అఖిల్‌ ఫిలిం.. డౌటే!!
X
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిన‌ట్టు .. ఒక్క ఫ్లాప్ జీవితాల్నే అల్లక‌ల్లోలం చేసేస్తోంది. అక్కినేని చియాన్ అఖిల్ న‌టించిన మొద‌టి సినిమా డెబ్యూ హీరోగా అఖిల్‌ కి బోలెడ‌న్ని పాఠాల్ని నేర్పించింది. అందుకే ఇప్పుడు అత‌డు ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇక రెండో సినిమా విష‌యంలో ఎట్టి ప‌రిస్థితిలో ఉపేక్షించేది లేదు. ఎంత పెద్ద ద‌ర్శ‌కుడు అనేదానికంటే త‌న‌ని గొప్ప‌గా వెండితెర‌పై ఆవిష్క‌రించే స‌మ‌ర్థుడు కావాలిప్పుడు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీసినా త‌న‌లోని యాక్టింగ్ స్కిల్స్‌ ని ఓ రేంజులో ఆవిష్క‌రించే ద‌మ్మున్న‌వాడై ఉండాలి. ఇప్పుడు రాసుకునే స్ర్కిప్టు విష‌యంలో ఎలాంటి లోటుపాట్లు ఉండ‌కూడ‌దు. అందుకే అఖిల్ బోలెడంత క‌స‌ర‌త్తు చేస్తున్నాడు.

అయితే అఖిల్ న‌టించే రెండో సినిమా పూరి జ‌గ‌న్నాథ్ దర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని ఇటీవ‌లి కాలంలో ప్ర‌చార‌మైంది. కింగ్ నాగార్జున ఈసారి అఖిల్‌ ని పూరీ చేతిలో పెట్టాల‌ని భావిస్తున్నారు. లోఫ‌ర్ రిజ‌ల్ట్ చూసి ఇక ఫైన‌ల్ చేసుకోవ‌డ‌మేన‌ని ప్ర‌చార‌మైంది. అయితే లోఫ‌ర్ రిలీజైంది. ఫ‌లితం యావ‌రేజ్ అని తేలింది. వ‌రుణ్‌ తేజ్‌ లోని న‌టుడికి మంచి మార్కులే వేసినా ఈ సినిమా ఫ‌లితం అఖిల్‌ కి - నాగార్జునకి ఓ రియ‌లైజేష‌న్‌ ని ఇచ్చింద‌ని చెబుతున్నారు. ఇప్పుడున్న స‌న్నివేశంలో పూరీ చేతిలో పెడితే మ‌ళ్లీ క‌థ‌ - కాక‌ర‌కాయ లేకుండా, రొటీన్ క‌థ‌తోనే సినిమా తీస్తాడ‌న్న భ‌యంలో ఉన్నార‌ని తెలుస్తోంది. క‌మ‌ర్షియ‌ల్‌ గా తీస్తాడు కానీ, క‌థ‌లో అంత ప‌ట్టు ఉండ‌ద‌న్న భ‌యం అక్కినేని కాంపౌండ్‌ ని భ‌య‌పెడుతోంద‌ని అంటున్నారు. అది సంగతి.